singapore: వధువు అక్రమ సంబంధాన్ని పెళ్లి పీటలపై సినిమాగా చూపిన వరుడు... వీడియో చూడండి!

  • తనతో తిరుగుతూ మరో వ్యక్తితో సంబంధం
  • పెళ్లి పీటలపై బుద్ధి చెప్పాలని భావించిన సింగపూర్ వరుడు
  • వీడియో చూసి అవమానంతో వెళ్లిపోయిన వధువు

పరాయి వ్యక్తితో అక్రమ సంబంధాన్ని కొనసాగిస్తూ, తనతో పెళ్లికి సిద్ధమైన ఓ అమ్మాయి బండారాన్ని నలుగురి ముందూ బట్ట బయలు చేసి, జీవితాంతం గుర్తుండే పాఠం చెప్పాలని భావించిన ఓ యువకుడు అనుకున్నంత పనీ చేశాడు. 'మిర్రర్ డాట్ కో డాట్ యూకే'లో వచ్చిన ఓ కథనం ప్రకారం, సింగపూర్ లో బంధు మిత్రులు, వధూవరుల స్నేహితులు పెళ్లి వేడుక కోసం సిద్ధమైన వేళ, వరుడు ఓ వీడియోను చూపుతానని చెబుతూ స్క్రీన్ పై తాను ముందే సమీకరించి పెట్టుకున్న వీడియోను ప్లే చేశాడు.

తొలుత వధూవరులు గతంలో కలిసి తిరిగిన దృశ్యాలతో ప్రారంభమైన వీడియో, ఒక్కసారిగా, ఆమె అక్రమ సంబంధాన్ని బయట పెట్టింది. మరో వ్యక్తితో కలసి హోటల్ రూమ్ లోకి వెళ్లడం, ఆపై అతనితో అక్రమ సంబంధాన్ని కొనసాగించడం కనిపించింది. ఈ వీడియోను చూసిన తరువాత అవమానంతో వధువు వెడ్డింగ్ హాల్ నుంచి వెళ్లిపోయింది. కాగా, ఈ వివాహాన్ని వారు రద్దు చేసుకున్నారా? లేదా? అన్న విషయం మాత్రం తెలియరాలేదు. ఆ వీడియోలోని కొన్ని దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్. వాటిని మీరూ చూడవచ్చు.


singapore
infidelity video
bride
groom
  • Error fetching data: Network response was not ok

More Telugu News