dulquar salman: దయచేసి నా సినిమాను చంపేయకండి: దుల్కర్ సల్మాన్

  • దుల్కర్ సల్మాన్ తాజా చిత్రంగా వచ్చిన 'సోలో' 
  • ఈ సినిమాపై నెగెటివ్ రివ్యూలు
  • ఇది ఒక ప్రయోగమని చెప్పిన దుల్కర్
  • చెడుగా ప్రచారం చేయవద్దని అభ్యర్థన          

దుల్కర్ సల్మాన్ విభిన్నమైన పాత్రలను పోషించిన మలయాళ చిత్రం 'సోలో' .. ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమాను గురించి అక్కడ నెగెటివ్ రివ్యూలు వచ్చాయి. ఆ రివ్యూల పట్ల దుల్కర్ సల్మాన్ సోషల్ మీడియా ద్వారా స్పందించాడు. ప్రేక్షకులకు కొత్తగా కనిపించడం కోసం .. కథా కథనాలు కొత్తగా అనిపించడం కోసం తాను ఈ సినిమా చేసినట్టు ఆయన చెప్పాడు. ప్రతి పాత్ర విషయంలో తాము ఎంతో శ్రద్ధ తీసుకున్నామని అన్నాడు.

 ఈ సినిమా గురించి కొంతమంది రాస్తోన్న రాతలు తనకి చాలా బాధ కలిగించాయని చెప్పాడు. కొత్తగా ఉండటం కోసం చేసిన ఒక ప్రయత్నం కొందరికి నచ్చకపోవచ్చనీ, అంతమాత్రాన ఆ విషయాన్ని పెద్దగా ప్రచారం చేయడం సరికాదని అన్నాడు. ఈ కథ ఎంపిక విషయంలో తన నిర్ణయం సరైనదిగానే తాను భావిస్తున్నాననీ, దర్శకుడి విజన్ ను కూడా తాను సపోర్ట్ చేస్తున్నానని చెప్పాడు. దయచేసి చెడు రాతలతో ఈ సినిమాను చంపేయకండి అంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు.  

  • Loading...

More Telugu News