anil kapoor: తమ సౌభాగ్యం కోసం భారీ పూజలు నిర్వహించిన బాలీవుడ్ భామలు.. ఫొటోలు పోస్ట్ చేసిన శ్రీదేవి!

  • అనిల్ కపూర్ ఇంట్లో కర్వా చౌధా వ్రతం
  • వ్రతంలో పాల్గొన్న పలువురు బాలీవుడ్ భామలు
  • ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన శ్రీదేవి

తమ సౌభాగ్యం బాగుండాలని కోరుతూ బాలీవుడ్ భామలంతా ఒక చోట చేరి ఘనంగా పూజలు నిర్వహించారు. తమ పసుపుకుంకుమలు కలకాలం నిలవాలని భగవంతుడిని ప్రార్థించారు. ఉత్తరాదిన నిర్వహించే కర్వా చౌధా వ్రత వేడుకల్లో వీరు పాల్గొన్నారు. బాలీవుడ్ అగ్రహీరో అనిల్ కపూర్ ఇంట్లో... ఆయన భార్య సునీతా కపూర్ ఆధ్వర్యంలో వ్రతం కొనసాగింది. ఈ వ్రతానికి శ్రీదేవి, రవీనా టాండన్, శిల్పాశెట్టి, నీలమ్ కొఠారీ, చంకీపాండే భార్య భావనా పాండే, సంజయ్ కపూర్ భార్య సంఘా, హీరో వరుణ్ ధావన్ తల్లి కరుణా ధావన్, వదిన జాహ్నవీ ధావన్ లు హాజరయ్యారు. దీనికి సంబంధించిన ఫొటోలను శ్రీదేవి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

anil kapoor
actress sridevi
shilpa shetty
raveena tandon
varun dhavan
karva chowdha at bollywood
  • Loading...

More Telugu News