rajashekar: భర్త కారు యాక్సిడెంట్ పై స్పందించిన జీవిత!

  • అభిమానులు ఆందోళన చెందవద్దు
  • మైనర్ యాక్సిడెంట్ మాత్రమే
  • ఎవరికీ ఏమీ కాలేదు
  • ఇకపై ఇలా జరగనివ్వను: జీవిత

రాత్రి జరిగిన కారు ప్రమాదంలో తన భర్త రాజశేఖర్ కు ఎటువంటి గాయాలు కాలేదని, అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జీవిత వెల్లడించారు. రాజశేఖర్ కు యాక్సిడెంట్ తరువాత ఎంతో మంది ఫ్యాన్స్ క్షేమ సమాచారాలను అడిగారని తెలిపిన ఆమె, తమ కుటుంబంపై ఉన్న అభిమానానికి కృతజ్ఞతలు తెలిపారు.

 ప్రమాదంలో ఎవరికీ ఏమీ జరగలేదని జీవిత చెప్పుకొచ్చారు. ఇది మైనర్ యాక్సిడెంట్ అని, రెండు కార్లు స్వల్పంగా దెబ్బతిన్నాయని అన్నారు. పోలీసులు నిర్వహించిన డ్రంకెన్ డ్రైవ్ పరీక్షల్లో తన భర్త మద్యం తాగలేదనే తేలిందని గుర్తు చేసిన జీవిత, గత కొంత కాలంగా ఆయన మనసు బాగాలేదని, ఏదో ఆలోచిస్తూ వాహనాన్ని నడిపినందునే ప్రమాదం జరిగిందని చెప్పారు. ఇకపై ఇటువంటి ఘటనలను జరగనీయబోనని, తన భర్త ఒంటరిగా వాహనం నడిపేందుకు అంగీకరించనని తెలిపారు. కేసు సమసిపోయినందున మీడియా కూడా సంయమనంతో వ్యవహరించాలని అన్నారు.

rajashekar
jeevita
accident
  • Loading...

More Telugu News