rape: 'నేనూ గిరిజనుడ్నే.. వర్షంలో తడవద్దు.. ఇంట్లోకి రండి' అని పిలిచి, అత్యాచారానికి పాల్పడిన యువకుడు!

  • వర్షంలో ఇంటి ముందు నిలబడిన మహిళను లోపలికి రమ్మన్న యువకుడు 
  • గిరిజన భాషలో మాట్లాడి నమ్మబలికిన వైనం 
  • విద్యుత్ సరఫరా నిలిపేసి, తలుపులు మూసి, అత్యాచారం

వర్షం పడుతుండడంతో ఒక ఇంటి ముందు నిలబడిన మహిళను లోపలికి పిలిచి అత్యాచారానికి పాల్పడిన ఘటన హైదరాబాదు, రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల్లోకి వెళ్తే... వికారాబాద్‌ జిల్లాకు చెందిన మహిళ (48) రాజేంద్రనగర్‌ ఉప్పర్‌ పల్లిలో నివాసం ఉండే తన కుమారుల వద్దకు వచ్చింది. ఈ క్రమంలో తమకు తెలిసిన వారివద్దకు వెళ్లి వస్తున్న సమయంలో వర్షం ఒక్కసారిగా జోరందుకుంది. దీంతో వర్షంలో తడవకుండా ఉండేందుకు ఒక ఇంటి ముందు నిల్చుంది.

ఆమె నిల్చున్న ఇంట్లోంచి బయటకు వచ్చిన రాజు నాయక్ (23) అనే యువకుడు ఆమెను గిరిజన మహిళగా గుర్తించి, తాను కూడా గిరిజనుడ్నేనని చెబుతూ, వారి భాషలోనే మాట్లాడి, వర్షం తగ్గేవరకూ ఇంట్లో కూర్చుని వెళ్లిపోవచ్చని తన ఇంట్లోకి ఆహ్వానించాడు. సొంత భాషలో మాట్లాడడంతో ఆ మేకవన్నెపులి అసలు రంగు తెలియని ఆమె ఆ ఇంట్లోకి వెళ్లింది. కాసేపటి తరువాత తలుపులు మూసి, విద్యుత్ సరఫరా నిలిపేసి, ఆమెపై అత్యాచారానికి తెగబడ్డాడు. ఆమె ఫిర్యాదుతో పోలీసులు అతనిని అదుపులోకి తీసుకున్నారు. 

  • Loading...

More Telugu News