allu arjun: ఊటీ షెడ్యూల్ చివరి దశలో 'నా పేరు సూర్య'

  •  షూటింగ్ దశలో ' నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా'
  •  ఆర్మీ ఆఫీసర్ గా అల్లు అర్జున్
  •  కొన్ని రోజులుగా ఊటీలో కీలక దృశ్యాల చిత్రీకరణ
  •  మరో రెండు రోజుల్లో ఈ షెడ్యూల్ పూర్తి  

అల్లు అర్జున్ .. వక్కంతం వంశీ కాంబినేషన్లో 'నా పేరు సూర్య .. నా ఇల్లు ఇండియా' సినిమా రూపొందుతోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ 'ఊటీ'లో జరుగుతోంది. హైదరాబాద్ లో రెండు షెడ్యూల్స్ ను పూర్తి చేసుకున్న ఈ సినిమా, క్రితం నెల 24వ తేదీన 'ఊటీ'లో మొదలైంది. ప్రధానమైన పాత్రలకి సంబంధించిన కొన్ని కీలకమైన సన్నివేశాలను అక్కడ తెరకెక్కిస్తున్నారు.

 ఈ నెల 10వ తేదీతో ఈ షెడ్యూల్ పూర్తి కానుంది. ఈ సినిమాలో అల్లు అర్జున్ మిలటరీ ఆఫీసర్ గా కనిపించనున్నాడు. పాత్రకి తగినట్టుగా కనిపించడం కోసం ఆయన ప్రత్యేక శిక్షణ తీసుకున్నాడు. దేశభక్తికి సంబంధించిన ఈ సినిమాలో కథానాయికగా అనూ ఇమ్మాన్యుయేల్ నటిస్తోంది. యాక్షన్ కింగ్ అర్జున్ .. శరత్ కుమార్ ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమా అల్లు అర్జున్ ను కొత్త కోణంలో చూపిస్తుందనే టాక్ వినిపిస్తోంది.  

  • Loading...

More Telugu News