kancha ilaiah: అమిత్ షా తొత్తులు వీళ్లు: వైశ్య నేతలపై ఐలయ్య సంచలన వ్యాఖ్య

  • వైశ్యులను ఉసిగొల్పుతున్నది అమిత్ షానే
  • కావాలంటే ఆయన చర్చకు రావచ్చు
  • బహిరంగ చర్చకు ఐలయ్య డిమాండ్

తన ఇంటికి వచ్చి గొడవ చేయాలని చూస్తున్న వైశ్య సంఘాల ప్రతినిధులు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తొత్తులని కంచ ఐలయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. కొద్దిసేపటి క్రితం మీడియాతో మాట్లాడిన ఆయన, అమిత్ షానే తన ఇంటిపైకి వైశ్యులను ఉసిగొల్పుతున్నారని ఆరోపించారు. తన ఇంటికి రావడానికి ఉప్పల శ్రీనివాస్ గుప్తా ఎవరని ప్రశ్నించిన ఐలయ్య, ఆయన వస్తే సమాధానం చెప్పడానికి తన జాతి సిద్ధంగా ఉందని, ధైర్యముంటే రావాలని సవాల్ విసిరారు.

అమిత్ షా హైదరాబాద్ కు వచ్చి తనను చర్చకు ఆహ్వానిస్తే వస్తానని, వైశ్యులు జాతికి చేసిన ద్రోహంపై మాట్లాడతానని అన్నారు. చదువురాని వారితో తాను చర్చకు వెళ్లే ప్రసక్తే లేదని, చేతనైతే అమిత్ షా వచ్చి తనతో బహిరంగ చర్చకు కూర్చోవాలని, ఇలా ఇళ్లపైకి తన మనుషులను పంపిస్తుంటే చూస్తూ ఊరుకోబోయేది లేదని హెచ్చరించారు.

kancha ilaiah
samajika smugglarlu komatollu
amit sha
  • Loading...

More Telugu News