vijayawada: అవన్నీ గతంలో నా తప్పులే... అమ్మాయిలతో గడిపిన వీడియోలపై బ్రదర్ ప్రదీప్ కుమార్

  • నేనిప్పుడు మారిపోయాను
  • వీడియోలు తీయించుకుంది నేనే
  • కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారు
  • 'జీసన్ మిరాకిల్స్' బ్రదర్ ప్రదీప్ వివరణ

తనపై ఉద్దేశపూర్వకంగానే ఆరోపణలు చేస్తున్నారని, క్రైస్తవ సమాజంలో తనకు వస్తున్న మంచి పేరును పాడుచేసేందుకు నిర్ణయించుకున్న కొన్ని సంఘాలు పని గట్టుకుని పాత వీడియోలకు కొత్త రంగు పులుముతున్నాయని 'జీసస్ మిరాకిల్స్' సంఘం వ్యవస్థాపకుడు బ్రదర్ ప్రదీప్ కుమార్ వెల్లడించారు. సోషల్ మీడియాలో, యూ ట్యూబ్ లో తనపై వస్తున్న వీడియోలపై స్పందించిన ఆయన, అవన్నీ గతంలో ఎప్పుడో తీసిన వీడియోలని అన్నారు. తాను గతంలో తప్పులు చేశానని, ఇప్పుడు మారిపోయానని అన్నారు.

తాను మారిన విధానాన్ని ప్రజలకు చూపించి, వారిని సన్మార్గంలో పెట్టాలన్న ఉద్దేశంతోనే తాను స్వయంగా ఆ వీడియోలు తీయించానని చెప్పారు. వాటిని తన వద్ద పనిచేసిన వారే రహస్యంగా దొంగిలించి ఇలా మీడియాలో పెట్టారని ఆరోపించారు. ఇటీవలి కాలంలో తనతో ఫోటోలు దిగిన అమ్మాయిలు అక్కాచెల్లెళ్ల వంటి వారని, వారంతా చర్చిలకు వచ్చే సభ్యులని చెప్పాడు. తన పరువు తీయాలని చూస్తూ, పాత వీడియోలు అప్ లోడ్ చేస్తున్న, చేసిన వాళ్లపై పోలీసులకు ఫిర్యాదు చేశానని, వారిపై చట్ట పరమైన చర్యలు తీసుకోనున్నానని తెలిపారు.

vijayawada
bezawada
jesus miracles
pradeep
  • Loading...

More Telugu News