rakul: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం!

  • సూర్య సరసన రకుల్ కి ఛాన్స్ 
  • కన్నడ సినిమా వార్తను ఖండించిన శ్రుతి హాసన్ 
  • సొంత బ్యానర్ ఏర్పాటు చేస్తున్న బాలకృష్ణ 
  • యూరప్ బయలుదేరుతున్న పవన్ కల్యాణ్

*  తెలుగులో బిజీగా వున్న రకుల్ ప్రీత్ సింగ్ మరోపక్క తమిళంలో కూడా సినిమాలు చేస్తోంది. ఈ క్రమంలో స్టార్ హీరో సూర్య సరసన నటించే ఛాన్స్ ఈ ముద్దుగుమ్మకు వచ్చినట్టు సమాచారం. సెల్వరాఘవన్ దర్శకత్వంలో రూపొందే చిత్రంలో సూర్య, రకుల్ జంటగా నటిస్తారట.
*  తాను కన్నడ సినిమాలో నటిస్తున్నానంటూ వస్తున్న వార్తలను అందాలభామ శ్రుతి హాసన్ ఖండించింది. ఈ వార్తలలో వాస్తవం లేదని, ఈ విషయమై తాను ఎవరితోనూ చర్చించలేదని తెలిపింది. అదీగాక ప్రస్తుతం కన్నడలో నటించే ఉద్దేశం కూడా లేదని శ్రుతి చెప్పింది.  
*  నందమూరి నటసింహం బాలకృష్ణ సొంత ప్రొడక్షన్ బ్యానర్ ను ఏర్పాటు చేయనున్నట్టు తెలుస్తోంది. తమ ఫ్యామిలీ తరఫున రామకృష్ణా సినీ స్టూడియోస్ బ్యానర్ ఉన్నప్పటికీ, మరొక సొంత చిత్ర నిర్మాణ సంస్థను నెలకొల్పడానికి ఆయన నిర్ణయం తీసుకున్నారట. తన తండ్రి ఎన్టీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా నిర్మించే చిత్రాన్ని ఈ కొత్త బ్యానర్ పైనే ప్రొడ్యూస్ చేస్తారట.
*  పవన్ కల్యాణ్ యూరప్ బయలుదేరనున్నాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రానికి సంబంధించిన రెండు పాటలను యూరప్ లోని అందమైన లోకేషన్స్ లో చిత్రీకరిస్తారు. పవన్ తో పాటు కీర్తి సురేష్, అనూ ఇమ్మానుయేల్ ఈ షూటింగులో పాల్గొంటారు.

  • Loading...

More Telugu News