sam: హిందూ, క్రిస్టియన్ పద్ధతుల్లో చైతూ, సమంతల పెళ్లి వెనుక ఆసక్తికర అంశం!

  • క్రిస్టియన్ సంప్రదాయ వివాహానికి పట్టుబట్టిన సమంత తల్లిదండ్రులు
  • విషయాన్ని నాగార్జునకు చెప్పిన సమంత
  • రెండు పద్ధతులనూ సూచించిన నాగ్
  • అక్కినేని ఇంటికి కోడలిగా వచ్చేసిన సమంత

శుక్రవారం నాడు పంచెకట్టులో నాగచైతన్య, పట్టు చీరలో తళుక్కుమంటూ సమంత హిందూ సంప్రదాయం ప్రకారం, వేద మంత్రోచ్చారణల మధ్య మూడుముళ్ల బంధంతో ఒకటై, ఆపై శనివారం నాడు సూటూ, బూటూ, బ్రైడల్ గౌన్ దుస్తులతో క్రైస్తవ సంప్రదాయం ప్రకారం ఉంగరాలు మార్చుకుని ఒకటయ్యారు. అసలు రెండు పద్ధతుల్లో వివాహం జరగాల్సిన అవసరం ఏంటి? ఈ ప్రశ్నకు ఇప్పుడు టాలీవుడ్ లో ఓ ఆసక్తికరమైన కథనం వినిపిస్తోంది.

వాస్తవంగా సమంతది క్రిస్టియన్ కుటుంబమన్న సంగతి అందరికీ తెలిసిందే. నాగార్జున తనయుడు చైతూను ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని తొలుత చెప్పినప్పుడు సమంత తల్లిదండ్రులు అంగీకరించలేదట. మతాంతర వివాహానికి అంగీకరించని అమ్మానాన్నలను నానా తంటాలు పడి మరీ సమంత ఒప్పించగా, తమ బిడ్డ వివాహం తమ సంప్రదాయంలో జరగాలని వారు కోరారట. ఇక ఇదే విషయాన్ని నాగార్జునకు చెప్పి, క్రిస్టియన్ పద్ధతిలో పెళ్లి జరిగితేనే తనకు ఆనందమని తేల్చి చెప్పిందట. పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రుల కోసం తాను ఈ మాత్రమైనా చేయాలని సమంత చేసిన విజ్ఞప్తితో ఆలోచనలో పడ్డ నాగ్, రెండు సంప్రదాయాల ప్రకారం వివాహం చేసుకోవాలని సూచించారట. దీనికి ఎగిరి గంతేసి ఒప్పుకున్న సమంత, అటు తల్లిదండ్రుల కోరికను, ఇటు అత్తింటి మత సంప్రదాయాలను గౌరవించి, అక్కినేని వారింట కోడలిగా కాలుపెట్టింది.

sam
  • Loading...

More Telugu News