pakistan airlines: నష్టాలు భరించలేం.. అమెరికాకు విమాన సర్వీసులను రద్దు చేస్తున్నాం: పాకిస్థాన్ ఎయిర్ లైన్స్

  • ఈ సర్వీసుల వల్ల ఏటా రూ. 125 కోట్ల నష్టం
  • నష్టాలు భరించలేకే తుది నిర్ణయం
  • 1961 నుంచి అమెరికాకు సర్వీసులను నడుపుతున్న పాకిస్థాన్ ఎయిర్ లైన్స్

ఈ నెల 31వ తేదీ నుంచి అమెరికాకు విమాన సర్వీసులను నిలిపి వేస్తున్నట్టు పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఎయిర్ లైన్స్ ప్రకటించింది. భారీ నష్టాలే దీనికి కారణమని చెప్పింది. అమెరికాకు విమాన సర్వీసులను నడపడం వల్ల తమ సంస్థకు ఏటా రూ. 125 కోట్ల నష్టం వాటిల్లుతోందని ఎయిర్ లైన్స్ అధికారులు తెలిపారు.

నష్టాలు భరించలేనంతగా తయారయ్యాయని... మరో దారి లేకే ఈ నిర్ణయానికి వచ్చామని చెప్పారు. 1961లో అమెరికాకు సర్వీసులను ఈ సంస్థ ప్రారంభించింది. ప్రస్తుతానికి న్యూయార్క్ తో పాటు అమెరికాలోని మరో మూడు నగరాలకు సర్వీసులను నడుపుతోంది. గతంలోనే అమెరికాకు సర్వీసులను నిలిపివేయాలని ఈ సంస్థ పలుమార్లు ప్రయత్నించింది. అయితే, రాజకీయ ఒత్తిడి వల్ల నిర్ణయాన్ని వాయిదా వేస్తూ వచ్చింది.

  • Loading...

More Telugu News