dulkar salman: దుల్కర్, అనుపమల 'అందమైన జీవితం'!

  • 'అందమైన జీవితం' పేరుతో తెలుగులోకి మలయాళ హిట్ మూవీ
  •  దుల్కర్ జోడీగా అనుపమ పరమేశ్వరన్
  •  మలయాళంలో సూపర్ హిట్
  •  తెలుగులో ఈ నెల 13న విడుదల      

మలయాళ యువ కథానాయకుడిగా దుల్కర్ సల్మాన్ కు .. కథానాయికగా అనుపమ పరమేశ్వరన్ కు ఎంతో క్రేజ్ వుంది. ఇటీవల వాళ్ల కాంబినేషన్లో వచ్చిన 'జొమోంటే సువిశేషంగళ్' చిత్రం అక్కడ భారీ విజయాన్ని సాధించింది. లవ్ .. ఫ్యామిలీ సెంటిమెంట్ కి ప్రాధాన్యతనిస్తూ తెరకెక్కించిన ఈ సినిమా అక్కడ 50 కోట్ల క్లబ్ లో చేరింది.

 లవ్ కి సరికొత్త నిర్వచనం చెప్పిన ఈ సినిమా, అక్కడి యూత్ ను ఒక రేంజ్ లో ఆకట్టుకుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాను 'అందమైన జీవితం' పేరుతో నిర్మాత పత్తిపాటి శ్రీనివాసరావు తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. సత్యన్ అంతిక్కడ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను ఇక్కడ ఈ నెల 13వ తేదీన విడుదల చేస్తున్నారు. 'ఓకే బంగారం' ద్వారా తెలుగు ప్రేక్షకులకు దుల్కర్ తెలుసు .. ఇక అనుపమ పరమేశ్వరన్ కి ఇక్కడ మంచి క్రేజ్ వుంది. కనుక ఈ సినిమాకి ఇక్కడ మంచి రెస్పాన్స్ వస్తుందని భావిస్తున్నారు.      

dulkar salman
anupama
  • Loading...

More Telugu News