lakshmis ntr: 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమాపై నిర్మాత, వైసీపీ నేత రాకేష్ రెడ్డి స్పందన

  • సినిమా వెనుక రాజకీయ కారణాలు లేవు
  • వర్మ నిజాయతీ నచ్చింది
  • ఈ సినిమా చరిత్రలో నిలిచిపోతుంది

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించనున్న 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమా నిర్మాణం వెనుక రాజకీయపరమైన కారణాలు లేవని నిర్మాత, వైసీపీ నేత రాకేష్ రెడ్డి అన్నారు. కథ నచ్చడంతోనే ఈ సినిమాను నిర్మించడానికి ముందుకొచ్చానని... జరిగిన ఘటనలన్నింటినీ ఉన్నవి ఉన్నట్టు తెరకెక్కించాలన్న వర్మ నిజాయతీ తనకు నచ్చిందని ఆయన చెప్పారు.

ఖర్చుకు ఏమాత్రం వెనుకాడకుండా చిత్ర నిర్మాణాన్ని చేపడతామని అన్నారు. ఈ సినిమాను చరిత్రలో నిలిచిపోయేలా తీయగలమని భావిస్తున్నామని చెప్పారు. నటీనటులు, సాంకేతిక నిపుణుల ఎంపికలో తాను కలగజేసుకోబోనని... అదంతా వర్మనే చూసుకుంటారని తెలిపారు. వర్మ మీద తనకు 200 శాతం నమ్మకం ఉందని చెప్పారు. 

lakshmis ntr
laxmis ntr
ram gopal varma
tollywoody lakshmis ntr producer
producer rakesh reddy
  • Loading...

More Telugu News