china open: చైనా ఓపెన్ నుంచి సానియా - షూయ్ పెంగ్ జోడి నిష్క్ర‌మ‌ణ‌

  • మార్టినా హింగిస్ - చాన్ యంగ్ జాన్ జోడి గెలుపు
  • సెమీ ఫైన‌ల్స్ వ‌ర‌కు చేరుకున్న సానియా జోడి
  • బీజింగ్‌లో జ‌రుగుతున్న పోటీలు

చైనాలోని బీజింగ్‌లో జ‌రుగుతున్న చైనా ఓపెన్ సిరీస్ నుంచి సానియా - షూయ్ పెంగ్‌ల‌ జోడి నిష్క్ర‌మించింది. సెమీ ఫైన‌ల్స్‌లో భాగంగా జరిగిన సూప‌ర్ టై బ్రేక్‌లో స్విట్జ‌ర్లాండ్‌కు చెందిన మార్టినా హింగిస్, తైవాన్‌కి చెందిన చాన్ యంగ్ జాన్‌ల జోడిపై సానియా జోడి ఓట‌మి పాలైంది. 6-2, 1-6, 5-10 తేడాతో సానియా జంట ఓడిపోయింది. గ‌త వారం వుహాన్‌లో జ‌రిగిన ఓపెన్ సిరీస్ సెమీ ఫైన‌ల్స్‌లో కూడా వీరి చేతిలోనే సానియా జంట ఓడిపోయింది. చైనా ఓపెన్ ఫైన‌ల్స్‌లో హింగిస్ - చాన్‌ల జోడి, తిమియా - ఆండ్రియా జోడీతో పోటీప‌డ‌నుంది. మ‌రో ప‌క్క సింగిల్స్‌లో సిమోనా హాలెప్ ఫైన‌ల్స్‌కి చేరుకుంది.

  • Error fetching data: Network response was not ok

More Telugu News