sowmya: సౌమ్య మర్డర్ కేసులో కొత్త ట్విస్ట్!

  • 10వ తరగతిలో ఉండగానే సౌమ్యకు వివాహం
  • ఇష్టం లేని భర్తతో కాపురం చేయలేక తల్లితో ఉంటున్న సౌమ్య
  • మరో వ్యక్తి ఆకర్షణకు గురైన సౌమ్యను హెచ్చరించే క్రమంలో దాడి చేసిన కృష్ణయ్య

హైదరాబాదులోని చింతల్ లో హత్యకు గురై ఐడీఎల్ చెరువులో శవంగా తేలిన సౌమ్య మర్డర్ కేసులో కొత్త ట్విస్టు వెలుగు చూసింది. షాపూర్ నగర్ లో ఉండే సౌమ్యకు 10వ తరగతిలో ఉండగానే వివాహం జరిగిందని బంధువులు తెలిపారు. అయితే ఆ వివాహం ఇష్టం లేని సౌమ్య, భర్తకు దూరంగా తల్లితోనే ఉంటూ చదవు కొనసాగిస్తోంది.

ఈ క్రమంలో చింతల్ లోని గీతాంజలి కాలేజ్ లో డిగ్రీ చదువుతోంది. ఆమధ్య ఒక వివాహ వేడుకలో సౌమ్యను కలిసిన దూరపు బంధువు, వరుసకు బావ అయ్యే కృష్ణయ్య ఆమెను వివాహం చేసుకునేందుకు ముందుకు వచ్చాడు. దీంతోనే గత ఆరు నెలలుగా వారిద్దరూ ప్రేమించుకుంటున్నారు. ఈ క్రమంలో సౌమ్య మరో వ్యక్తితో సన్నిహితంగా ఉండడాన్ని గుర్తించిన కృష్ణయ్య ఆమెను హెచ్చరించాడు. ఈ క్రమంలో జరిగిన వాగ్యుద్ధంలో ఆమెపై దాడిచేసిన కృష్ణయ్య, ఆమెను హతమార్చాడని తెలుస్తోంది. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. 

sowmya
krishnayya
jeedimetla
shapurnagar
murder
  • Loading...

More Telugu News