singer chinmayi: సింగర్ చిన్మయిని టార్గెట్ చేసిన పవన్ ఫ్యాన్స్.. మర్యాదగా మాట్లాడండన్న చిన్మయి!

  • రేణు దేశాయ్ కి మద్దతుగా చిన్మయి కామెంట్
  • మండిపడ్డ పవన్ ఫ్యాన్స్
  • గౌరవంగా మాట్లాడాలన్న చిన్మయి
  • వ్యక్తిగత ద్వేషంతోనే ఇదంతా చేస్తున్నారన్న సింగర్

రెండో పెళ్లికి సంబంధించిన వ్యవహారంలో పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్ పై ఆయన అభిమానులు ఓ రేంజ్ లో విరుచుకుపడ్డ సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పీకే అభిమానులపై రేణు ఆగ్రహం వ్యక్తం చేశారు కూడా. ఈ నేపథ్యంలో, రేణుకు మద్దతుగా సింగర్ చిన్మయి సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. దీంతో పవన్ అభిమానులు చిన్మయిపై కూడా ధ్వజమెత్తారు.

ఈ నేపథ్యంలో చిన్మయి సోషల్ మీడియా ద్వారా మరో కామెంట్ పెట్టింది. "ఒక మహిళ చెప్పిన దానిని ఇతరులు సరైన రీతిలో తీసుకోవాలి. ఒక మహిళను సోషల్ మీడియా వేదికగా పురుషులు వేధించడం మరోసారి జరిగింది. మన దేశంలోనే కాకుండా, ప్రపంచ వ్యాప్తంగా ఇది జరిగింది. నాకు తెలిసినంత వరకు 2017 మార్చి నుంచి కొంత మంది వ్యక్తులు ఎలాంటి సరైన పాయింట్ లేకుండానే ఎదుటి వ్యక్తిని కించపరడం జరుగుతోంది. వ్యక్తిగత ద్వేషంతోనే ఇదంతా చేస్తున్నారు" అంటూ చిన్మయి మండిపడింది.

దీంతో, చిన్మయిని పవన్ ఫ్యాన్స్ టార్గెట్ చేయడం ప్రారంభించారు. ఆమెను కించపరుస్తూ వ్యాఖ్యలు చేస్తున్నారు. దీనిపై చిన్మయి ప్రశాంతంగానే స్పందించింది. "ఒకవేళ నేను చెప్పింది మీకు నచ్చకపోతే... గౌరవపూర్వకంగా మాట్లాడండి... అప్పుడు నేనేమైనా తప్పుగా మాట్లాడి ఉంటే సరిదిద్దుకునేందుకు ప్రయత్నిస్తా" అని చెప్పింది. అవమానకరంగా మాట్లాడితే తాను పట్టించుకోనంటూ స్పష్టం చేసింది. 

singer chinmayi
tollywood
renu desai
pawan kalyan
pawan kalyan fans
pawan fans trolls chinmayi
  • Loading...

More Telugu News