t20: ఆసీస్-ఇండియా తొలి టీ20 జరగడం సందేహమే!

  • తొలి టీ20కి వర్ష గండం
  • గత రెండు రోజులుగా రాంచీలో వర్షం
  • ఈరోజు కూడా వర్షం పడే అవకాశం

ఆస్ట్రేలియా-భారత్ ల మధ్య టీ20ల సిరీస్ నేడు ప్రారంభం కానుంది. తొలి టీ20 ఈ రోజు రాంచీ వేదికగా జరగనుంది. వన్డే సిరీస్ అనంతరం ఆరు రోజుల పాటు విశ్రాంతి తీసుకున్న ఇరు జట్ల ఆటగాళ్లు ఇప్పుడు పొట్టి ఫార్మాట్ కు సిద్ధమైపోయారు. అయితే, ఈ మ్యాచ్ జరుగుతుందా? లేదా? అనే దానిపై సందేహాలు నెలకొన్నాయి.

గత రెండు రోజులుగా రాంచీలో వర్షాలు కురుస్తున్నాయి. నగరమంతా జలమయమైంది. ఈ రోజు కూడా వర్షం కురిసే అవకాశాలున్నాయి. దీంతో, క్రికెట్ అభిమానులు కలవరపాటుకు గురవుతున్నారు. ముఖ్యంగా, జార్ఖండ్ కు చెందిన అభిమానులు చాలా కంగారు పడుతున్నారు. ధోనీ హోమ్ టౌన్ రాంచీ కావడమే దీనికి కారణం. సొంత గ్రౌండ్ లో ధోనీ ఆటను చూడాలని వీరంతా ఉవ్విళ్లూరుతున్నారు. 

t20
first t20
team india
australia cricket
  • Loading...

More Telugu News