sailaja kiran: జగన్ భార్య భారతితో స్నేహం.. రాజకీయాల్లోకి ఎంట్రీపై 'మార్గదర్శి' ఎండీ శైలజా కిరణ్ స్పందన!

  • మాకు ఎవరితోనూ శత్రుత్వం లేదు
  • అందరితో స్నేహంగానే ఉంటాం
  • రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన ప్రస్తుతానికి లేదు

'ఈనాడు' రామోజీరావు పెద్ద కుమారుడు కిరణ్ సతీమణి శైలజా కిరణ్ కు వైసీపీ అధినేత జగన్ భార్య భారతితో మంచి స్నేహ సంబంధాలే ఉన్నాయి. ఇదే విషయం గురించి వెబ్ ఛానల్ 'ఐడ్రీమ్' ఆమెను ప్రశ్నించింది. ఈనాడుకు, సాక్షికి పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉందని... ఇలాంటి నేపథ్యంలో, భారతికి, మీకు మంచి స్నేహం కొనసాగుతోందని, ఇద్దరూ కలసి పార్టీలకు కూడా వెళుతుంటారని... ఇదెలా సాధ్యం? అని ఐడ్రీమ్ ప్రశ్నించింది.

దీనికి సమాధానంగా, తనకు ఎవరితోనూ వ్యక్తిగత భేదాభిప్రాయాలు లేవని చెప్పారు. 'ఈనాడు'లో తమ ఛైర్మన్ రామోజీరావు దగ్గర నుంచి కింద స్థాయిలో పని చేసే ఉద్యోగి వరకు అందరం, అందరి పట్ల స్నేహ భావంతోనే మెలుగుతామని చెప్పారు. తమకు ఎవరి పట్ల శత్రుత్వం లేదని తెలిపారు. భారతిని తాను ఎన్నడూ కలవలేదని.. మీరన్నట్టు పార్టీల్లో కూడా తాము కలవలేదని చెప్పారు.

రాజకీయాల్లో ఎంట్రీ గురించి ప్రశ్నించగా... ప్రస్తుతానికైతే అలాంటి ఆలోచన లేదని చెప్పారు. రాజకీయాలంటేనే ప్రజలకు సేవ చేయడమని... ఇలాంటి అదృష్టం అందరికీ రాదని చెప్పారు. 

sailaja kiran
ys bharathi
ys jagan
ramojirao
eenadu group
sakshi
sailaja kiran comments on bharathi
sailaja kiran comments on political entry
  • Loading...

More Telugu News