team india: నేడే తొలి టీ20... హోరాహోరీ జరగనున్న టీ20 సిరీస్!

  • రాంచీ వేదికగా తొలి టీ20 మ్యాచ్ 
  • ఐపీఎల్ స్టార్ ఆటగాళ్లు తలపడుతున్న తొలి టీ20 మ్యాచ్
  • హోరాహోరీ మ్యాచ్ పై సర్వత్రా ఆసక్తి

ఆస్ట్రేలియాతో రాంచీ వేదికగా తొలి టీ20 మ్యాచ్ నేటి సాయంత్రం జరగనుంది. టీ20ల్లో అగ్రజట్లైన టీమిండియా, ఆస్ట్రేలియా జట్ల మధ్య పోరు ఆసక్తికరంగా ఉంటుందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఆసీస్ జట్టులోని కీలక ఆటగాళ్లంతా ఐపీఎల్ లో కీలక పాత్ర పోషిస్తున్న నేపథ్యంలో ఇక్కడి పిచ్ లు, ఆటగాళ్లపై పూర్తి అవగాహన ఉంది. ఇప్పటికే టెస్టు, వన్డే సిరీస్ ను కోల్పోయిన ఆసీస్ జట్టు టీ20 సిరీస్ ను ఎలాగైనా గెలుచుకోవాలన్న లక్ష్యంతో ఉంది.

ఐపీఎల్ స్టార్ ఆటగాళ్లైన డేవిడ్ వార్నర్, ఆరోన్ ఫించ్, స్టీవ్ స్మిత్, మోసెస్ హెన్రిక్స్, గ్లెన్ మ్యాక్స్ వెల్, కేన్ రిచర్డ్ సన్, కల్టర్ నైల్ తదితరులు ఆసీస్ జట్టులో ఉన్నారు. వారికి దీటుగా ఆడేందుకు ఐపీఎల్ హీరోలు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, ధోనీ, దినేష్ కార్తీక్, మనీష్ పాండే, కేదార్ జాదవ్, హార్దిక్ పాండ్య, భువనేశ్వర్ కుమార్, బుమ్రా, చాహల్ తదితరులు సిద్ధంగా ఉన్నారు.

ఐపీఎల్ లో అత్యుత్తమ ఆటగాళ్లుగా పేరు సంపాదించుకున్న ఆటగాళ్లంతా నేటి మ్యాచ్ లో తలపడడంతో మ్యాచ్ ఆసక్తిగా సాగుతుందని అభిమానులు ఆశిస్తున్నారు. ఈ నేపథ్యంలో నేటి మ్యాచ్ పై సర్వత్రా ఆసక్తి వ్యక్తమవుతోంది. 

team india
Australia cricket team
t20
ranchy
  • Loading...

More Telugu News