anushka: సినిమా కబుర్లు... సంక్షిప్త సమాచారం!

  • కథల పట్ల అనుష్క నిర్ణయం 
  • కేరళలో సేదదీరుతున్న రామ్ చరణ్
  • విజయ్ 'అదిరింది'కి అరుదైన గౌరవం 
  • ప్రీ ప్రొడక్షన్ పనుల్లో 'ఉన్నది ఒక్కటే జిందగీ'  

*  'నా స్థాయికి తగని కథలను మాత్రం ఎట్టి పరిస్థితులలోను ఒప్పుకోను' అంటోంది స్వీటీ అనుష్క. 'కెరీర్ ప్రారంభంలోనే అరుంధతి లాంటి సినిమా చేశాను. ఆ తర్వాత బాహుబలి, రుద్రమదేవి వంటి కథలు చేశాను. దీంతో ఓ స్థాయి తెచ్చుకున్నాను. ఇప్పుడు వీటికి తగ్గా కథలనే ఎంచుకోవాలి. అనుష్క చేతిలో సినిమాలు లేవు అనుకున్నా పర్వాలేదు కానీ, స్థాయికి తగని కథలు మాత్రం ఒప్పుకోను' అని చెప్పింది అనుష్క.      
*  'రంగస్థలం 1985' చిత్రానికి సంబంధించిన భారీ యాక్షన్ ఎపిసోడ్ ను చేసిన తర్వాత హీరో రామ్ చరణ్ కేరళ వెళ్లాడు. ప్రస్తుతం అక్కడ నేచర్ క్యూర్ స్పాలో సేదదీరుతున్నాడు. మరో వారంలో హైదరాబాదుకి వచ్చి షూటింగులో పాల్గొంటాడు.    
*  విజయ్ హీరోగా నటించిన తమిళ చిత్రం 'మెర్సల్'ను తెలుగులోకి 'అదిరింది' పేరిట అనువదిస్తున్న సంగతి విదితమే. తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రాన్ని దీపావళికి గ్రాండ్ రిలీజ్ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా, ఈ చిత్రానికి ఒక అరుదైన గౌరవం దక్కనుంది. పారిస్ లోని లీ గ్రాండ్ రెక్స్ థియేటర్ లో ఈ చిత్రాన్ని ప్రదర్శించనున్నారు. బాహుబలి 2,  కబాలి చిత్రాల తర్వాత అక్కడ ప్రదర్శితమవుతున్న దక్షిణాది చిత్రం ఇదే కావడం విశేషం.  
*  ఎనర్జిటిక్ హీరో రామ్ హీరోగా రూపొందుతున్న 'ఉన్నది ఒక్కటే జిందగీ' చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. త్వరలో విడుదలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో చిత్రం ప్రచార కార్యక్రమాలను మొదలుపెట్టనున్నారు. ఇందులో అనుపమ పరమేశ్వరన్, లావణ్య త్రిపాఠి కథానాయికలుగా నటించారు.  

  • Loading...

More Telugu News