Hyderabad: జీడిమెట్లలో దారుణం... మరదలిని చంపిన బావ!

  • మరదలిని చంపి, చెరువులో పడేసిన బావ
  • కాలేజీ నుంచి కుమార్తె ఇంటికి రాలేదని ఫిర్యాదు చేసిన తల్లి
  • కూకట్ పల్లి పోలీస్ స్టేషన్ లో లొంగిపోయిన బావ కృష్ణయ్య

హైదరాబాదులో దారుణం చోటుచేసుకుంది. జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని షాపూర్ నగర్ లో నివాసముండే సౌమ్య అనే విద్యార్థినిపై ఆమె బావ కృష్ణయ్య దాడి చేసి హతమార్చాడు. కాలేజీకి వెళ్లే సౌమ్య ఇంటికి చేరకపోవడంతో ఆమె తల్లి జీడిమెట్ల పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు అనుమానితులపై ఆరాతీశారు. సౌమ్య బావ కృష్ణయ్యపై ఆమె అనుమానం వ్యక్తం చేసింది.

ఇదే సమయంలో నిందితుడు కృష్ణయ్య కూకట్ పల్లి పోలీస్ స్టేషన్ కు వచ్చి లొంగిపోయాడు. తన మరదలిని తానే చంపానని పోలీసులకు చెప్పాడు. తను ప్రతిరోజూ ఫోన్ లో ఎవరితోనో మాట్లాడుతోందని, మందలించే ప్రయత్నంలో కొట్టానని, గట్టిగా తగలడంతో ఆమె చనిపోయిందని తెలిపాడు. అనంతరం ఆమెను చెరువులో పడేశానని చెప్పాడు. దీంతో పోలీసులు ఆమె మృతదేహాన్ని వెలికితీసి, పోస్టుమార్టంకి తరలించారు. 

Hyderabad
jeedimetla
shpurnagar
murder
  • Loading...

More Telugu News