face book: ఫేక్ న్యూస్ కి చెక్... ఫేస్‌బుక్‌లో మరో కొత్త ఫీచర్!
- ఫేస్‌బుక్‌లో ఫేక్ న్యూస్ ను అరికట్టేందుకు కొత్త బటన్
- వార్తల సోర్స్ కు సంబంధించి యూజర్లకు మరింత సమాచారం
- ఫేస్ బుక్ పేజీ నుంచి బయటికి వెళ్లకుండానే న్యూస్ సోర్స్ పై సమాచారం
సోషల్ మీడియా వెబ్‌సైట్ ఫేస్‌బుక్ ఇప్పటికే ఎన్నో కొత్త కొత్త ఫీచర్లను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. తమ వెబ్‌సైట్‌లో వైరల్ అవుతోన్న ఫేక్ న్యూస్‌పై కూడా ఇప్పటికే ఫేస్‌బుక్ పలు చర్యలు తీసుకుంది. ఇప్పుడు ఫేస్‌బుక్‌లో వచ్చే అటువంటి వార్తలకు అడ్డుకట్ట వేసేందుకు ఓ కొత్త బటన్‌ను తన ప్లాట్‌ఫామ్ మీద టెస్ట్ చేస్తోంది. ఫేస్‌బుక్‌లో పెట్టే వార్తల సోర్స్ కు సంబంధించి యూజర్లు మరింత సమాచారం పొందవచ్చు.
ఫేస్‌బుక్ ప్రవేశపెడుతోన్న ఈ బటన్‌ను క్లిక్ చేస్తే ఆ పేజీ నుంచి బయటికి వెళ్లకుండానే న్యూస్ ఆర్టికల్ సోర్స్ గురించి యూజర్లు మరింత సమాచారాన్ని తెలుసుకోవచ్చు. తమ వెబ్‌సైట్‌లో వచ్చే న్యూస్ ఎంత వరకు నిజమో, ఆ న్యూస్ ఏ వెబ్‌సైట్ నుంచి వచ్చిందో సులువుగా తెలుసుకోవడానికి ఈ కొత్త ఫీచర్ ను తెచ్చినట్లు ఫేస్‌బుక్ ప్రతినిధులు తెలిపారు.