shilpa shetty kundra: పిల్ల‌ల్లో దాగివున్న టాలెంట్ బ‌య‌టికి తీసుకురావ‌డం గురించి పుస్త‌కం రాయ‌నున్న న‌టి

  • రెండో పుస్త‌కం రాయ‌నున్న శిల్పాశెట్టి
  • పూర్తిగా పిల్ల‌ల పెంప‌కం గురించిన విష‌యాలే
  • టీవీ షోలో పిల్ల‌లే స్ఫూర్తి

సినీ న‌టిగా, డ్యాన్స‌ర్‌గా, యోగా శిక్ష‌కురాలిగా, ర‌చ‌యిత‌గా ఇలా అన్ని రంగాల్లోనూ శిల్పాశెట్టి  త‌న ప్ర‌తిభ‌ను క‌న‌బ‌రిచారు. త్వ‌ర‌లో ఆమె త‌న రెండో పుస్త‌కం రాసేందుకు సిద్ధ‌మ‌వుతున్న‌ట్లు తెలుస్తోంది. ప్ర‌స్తుతం `సూప‌ర్ డ్యాన్స‌ర్స్‌` అనే పిల్ల‌ల డ్యాన్సింగ్ టీవీ కార్య‌క్రమానికి ఆమె న్యాయ‌నిర్ణేత‌గా వ్య‌వ‌హరిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఆ కార్య‌క్ర‌మంలో పాల్గొంటున్న పిల్ల‌ల స్ఫూర్తితో చిన్న‌పిల్ల‌ల్లో దాగివున్న టాలెంట్‌ను బ‌య‌టికి తీసుకురావ‌డం గురించి పుస్త‌కం రాయాల‌ని శిల్పా నిర్ణయించుకున్న‌ట్లు స‌మాచారం.

 ఈ పుస్త‌కంలో పూర్తిగా పిల్ల‌ల పెంప‌కం గురించి ఆమె వివ‌రించనున్నారు. అంతేకాకుండా టీవీ కార్య‌క్ర‌మాల్లో కొంత‌మంది పిల్ల‌లు చూపించిన అద్భుత ప్ర‌తిభ గురించి కూడా ఆమె పుస్త‌కంలో ప్ర‌స్తావించ‌నున్నార‌ట‌. పిల్ల‌ల్లో క‌నిపించే మొత్తం 465 ఆస‌క్తిక‌ర ప్ర‌తిభ‌ల గురించి ఆమె తెలియ‌జేయనున్నారు‌. `ద గ్రేట్ ఇండియ‌న్ డైట్: బ‌స్టింగ్ ద బిగ్ ఫ్యాట్ మిత్‌` పేరుతో ఆమె ఇప్ప‌టికే ఓ పుస్త‌కం రాశారు. ఇందులో ఆరోగ్య‌క‌ర ఆహారపు అల‌వాట్లు, జీవ‌న విధానాల గురించి శిల్పా వివ‌రించారు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News