ntr: ఎన్టీఆర్ తో దిల్ రాజు భారీ బడ్జెట్ చిత్రం?

  • 'స్పైడర్' పంపిణీదారుడిగా దిల్ రాజుకు నష్టాలు
  • వాటి నుంచి గట్టెక్కడానికి పెద్ద సినిమా ప్లాన్
  • ఎన్టీఆర్ ను ఒప్పించాడంటూ వార్తలు
  • దర్శకుడిగా 'బొమ్మరిల్లు' భాస్కర్

ఈ మధ్య కాలంలో దిల్ రాజు వరుస సినిమాలను నిర్మిస్తూ, కంటెంట్ .. కాంబినేషన్ బావుందనుకున్న సినిమాలను పంపిణీ చేస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో దసరాకి వచ్చిన 'జై లవ కుశ' .. ' స్పైడర్' .. ' మహానుభావుడు' సినిమాలను ఆయనే పంపిణీ చేశారు. 'జై లవ కుశ' .. 'మహానుభావుడు' సినిమాలు ఓ మాదిరి లాభాలు తెచ్చిపెట్టినా, 'స్పైడర్' మాత్రం పెద్ద మొత్తంలో నష్టం తెచ్చిపెట్టిందని అంటున్నారు.

 ఈ నష్టం దాదాపు 10 కోట్లవరకూ ఉండొచ్చని చెబుతున్నారు. ఈ నష్టం నుంచి బయటపడాలంటే ఆయన మరో స్టార్ హీరోతో సినిమా ఎనౌన్స్ చేయాల్సిందే. ఈ పరిస్థితుల్లో ఎన్టీఆర్ ను దిల్ రాజు కలవగా, ఆయనతో సినిమా చేయడానికి ఎన్టీఆర్ అంగీకరించాడని అంటున్నారు. ఈ సినిమాకి 'బొమ్మరిల్లు' భాస్కర్ దర్శకత్వం వహించే ఛాన్స్ ఉందని చెబుతున్నారు. ఇందులో వాస్తవమెంతన్నది చూడాలి మరి. 

ntr
  • Loading...

More Telugu News