two wheeler: టూ వీల‌ర్ కొంటే మేక ఫ్రీ... త‌మిళ‌నాడులో ఓ వాహ‌నాల కంపెనీ ఆఫ‌ర్‌

  • అమ్మ‌కాలు పెంచుకునే ప్ర‌య‌త్నం
  • వెల్లువెత్తిన వినియోగ‌దారులు
  • మేకలు అందుబాటులో లేక ఆఫ‌ర్ ఆపేసిన కంపెనీ

పండ‌గ సీజ‌న్ల‌లో లేదంటే అమ్మ‌కాలు త‌క్కువ‌గా ఉన్న‌పుడో కంపెనీలు ఆఫ‌ర్లు పెడ‌తాయి. అదే బాట‌లో త‌మిళ‌నాడులోని శివ‌గంగ జిల్లా ఇల‌యాంగుడి ప్రాంతంలోని హీరో మోటార్ కార్పోరేష‌న్ డీల‌ర్ అయిన 'గాయ‌త్రి మోటార్స్' కూడా ఓ ఆఫ‌ర్ పెట్టింది. అక్టోబ‌ర్ 11 నుంచి అక్టోబ‌ర్ 14 మ‌ధ్య వారి ద‌గ్గ‌ర టూ వీల‌ర్ కొన్న వారికి ఒక మేక‌ను ఉచితంగా ఇస్తామ‌ని ప్ర‌క‌టించింది.

దీనికి సంబంధించిన ప్ర‌క‌ట‌న‌ పోస్ట‌ర్ల‌ను ఆ ప్రాంతం మొత్తం అంటించింది. అంతే... వారు అనుకున్నదాని కంటే ఎక్కువ మంది ఈ ఆఫ‌ర్ గురించి విచారించ‌డం మొద‌లుపెట్టారు. అలా సంప్ర‌దించిన ప్ర‌తి ఒక్క‌రు టూ వీల‌ర్ కొన‌డానికి ఆస‌క్తిగా ఉన్న‌ట్లు గాయ‌త్రి మోటార్స్ సంస్థ గ్ర‌హించింది. అయితే, తమ ద‌గ్గ‌ర అంత‌మందికి స‌రిప‌డ మేక‌లు లేవ‌ని గుర్తించి, ఇప్పటికే అడ్వాన్సు బుకింగ్ చేసుకున్న వారి వరకు మాత్రమే మేకలను ఇవ్వగలమని చెప్పి, ఈ ఆఫ‌ర్‌ను ఉపసంహరించుకుంది.

అలాగే, ఇల‌యాంగుడి ప్రాంతంలో వారికి పోటీగా ఉన్న హోండా డీల‌ర్‌షిప్ కంపెనీ టూ వీల‌ర్ కొంటే సోఫా సెట్ ఉచితంగా ఇస్తాన‌ని ప్ర‌క‌టించింది. వారి పోటీని త‌ట్టుకోవ‌డానికి బాగా ఆలోచించి ఈ మేక ఆఫ‌ర్ తెర‌మీద‌కి తీసుకువ‌చ్చిన‌ట్లు గాయ‌త్రి మోటార్స్ ప్ర‌తినిధులు చెప్పారు.  

  • Error fetching data: Network response was not ok

More Telugu News