international campaign for abolition of nuclear weapons: అంతర్జాతీయ అణ్వస్త్ర నిషేధ ఉద్యమ సంస్థకు 2017 నోబెల్ శాంతి పురస్కారం
- ప్రకటించిన నోబెల్ కమిటీ
- అణ్వాయుధాల తయారీ నిషేధంపై కృషి చేసిన ఐసీఏఎన్
- బహుమతిగా 1.1 మిలియన్ డాలర్లు
2017 నోబెల్ శాంతి బహుమతిని అంతర్జాతీయ అణ్వస్త్ర నిషేధ ఉద్యమ సంస్థ (ఐసీఏఎన్)కు అందజేస్తున్నట్లు నోబెల్ కమిటీ ప్రకటించింది. మానవాళికి తీవ్రనష్టం కలిగించే అణ్వాయుధాల నిషేధంపై ఆయా దేశాల మధ్య ఒప్పందాలు కుదరడంలో ఈ సంస్థ చేసిన కృషికి గాను ఈ బహుమతి అందజేస్తున్నట్లు నోబెల్ కమిటీ వెల్లడించింది. ఆ సంస్థకు బహుమతిగా 1.1 మిలియన్ డాలర్లను ఇవ్వనున్నట్లు తెలిపింది.
ల్యాండ్ మైన్లు, జీవాయుధాలు, రసాయనాయుధాలతో పోల్చినపుడు అణ్వాయుధాలు చాలా ప్రమాదకరమైనవని, వాటి తయారీని, వాడకాన్ని నిషేధించాలని జెనీవాకు చెందిన ఐసీఏఎన్ ప్రచారం చేసింది. ప్రస్తుతం అమెరికా, ఉత్తర కొరియాల మధ్య తలెత్తిన అణ్వాయుధ ప్రయోగిత యుద్ధపరిస్థితిని కూడా సద్దుమణిగేలా చేయడంలో కృషి చేయాలని ఐసీఏఎన్ సంస్థను నోబెల్ కమిటీ కోరింది. ఒకప్పటితో పోల్చితే ప్రస్తుతం అణ్వాయుధాలు ఉపయోగించే ముప్పు ఎక్కువగా ఉందని, అటువంటి దేశాలపై దృష్టి సారించాలని సూచించింది.