ntr: ఎన్టీఆర్ కోసం త్రివిక్రమ్ మరో కథను సెట్ చేస్తున్నాడా?

  •  త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ మూవీ
  •  యాక్షన్ నేపథ్యంలో ఉంటుందని ప్రచారం
  •  వినోదభరితంగా ఉంటుందంటూ తాజా సమాచారం
  •  త్రివిక్రమ్ మార్క్ హీరోగానే కనిపించనున్న ఎన్టీఆర్    

ప్రస్తుతం పవన్ కల్యాణ్ తో త్రివిక్రమ్ ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా పూర్తి కాగానే ఆయన ఎన్టీఆర్ తో కలిసి సెట్స్ పైకి వెళ్లనున్నాడు. త్రివిక్రమ్ ఈ సినిమాలో ఎన్టీఆర్ ను మిలటరీ ఆఫీసర్ పాత్రలో చూపించనున్నట్టు వార్తలు వచ్చాయి. అయితే 'జై లవ కుశ' విడుదలైన తరువాత త్రివిక్రమ్ మరో కథను సెట్ చేస్తున్నట్టుగా టాక్ వినిపిస్తోంది.

లవ .. కుశ పాత్రల్లో ఎన్టీఆర్ పండించిన హాస్యం త్రివిక్రమ్ కి బాగా నచ్చేసిందట. దాంతో వినోదభరితంగానే ఎన్టీఆర్ కథను మలచాలనే నిర్ణయానికి వచ్చేశాడని సమాచారం. తన ఆలోచన గురించి ఆయన ఎన్టీఆర్ కి చెబితే .. అలాగే కానిమ్మంటూ ఎన్టీఆర్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడని చెబుతున్నారు. ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ యాక్షన్ పాళ్లు తగ్గించుకుని .. త్రివిక్రమ్ మార్క్ హీరోగానే కనిపిస్తాడన్నమాట.     

ntr
  • Loading...

More Telugu News