illeana: మొదట్లో నాకు మహేష్ బాబు అంటే ఎవరో తెలియదు: ఇలియానా

  • 16 ఏళ్ల వయసులో చిత్రపరిశ్రమలో అడుగుపెట్టాను
  • తొలి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నాను
  • పోకిరి సినిమా నాటికి మహేష్ గురించి తెలీదు

కెరీర్ తొలినాళ్లలో మహేష్ బాబు ఎవరో కూడా తనకు తెలియదని టాలీవుడ్ టాప్ హీరోయిన్ గా వెలుగొందిన ఇలియానా తెలిపింది. దక్షిణ ముంబైలో జరిగిన ఫ్యాషన్ షోలో పాల్గొన్న ఇలియానా మాట్లాడుతూ, ఎయిర్‌ హోస్టెస్‌ కావాలన్నది తన చిన్ననాటి కల అని, ఎయిర్ హోస్టెస్ అయితే ఉచితంగా ప్రపంచాన్ని చుట్టేయొచ్చని భావించానని తెలిపింది. ఆ తరువాత ఫ్యాషన్ డిజైనింగ్ చెయ్యాలని భావించానని, కాలేజీ రోజుల్లో క్లాసెస్ జరుగుతున్నప్పుడు లాస్ట్ బెంచ్ లో కూర్చుని డిజైన్లు గీస్తూ కూర్చునేదానినని తెలిపింది.

తరువాత సైకాలజీ చేయాలని భావించానని, చిట్టచివరకు చిత్రపరిశ్రమలో తేలానని తెలిపింది. 16 ఏళ్ల వయసులో సినీ పరిశ్రమలో అడుగుపెట్టిన తాను తొలి సినిమాతోనే గుర్తింపు తెచ్చుకున్నానని తెలిపింది. ఆ తరువాత మహేష్ బాబు ‘పోకిరి’ సినిమాలో నటించే అవకాశం వచ్చిందని తెలిపింది. అప్పట్లో మహేశ్‌ అంటేనే తెలిసేది కాదని చెప్పింది. చిత్రపరిశ్రమను అర్థం చేసుకునేందుకే తనకు చాలా కాలం పట్టిందని వెల్లడించింది. సినీ పరిశ్రమలో కాలం గడుస్తున్న కొద్దీ నటనపై ప్రేమ, గౌరవం పెరిగాయని తెలిపింది. 

illeana
mahesh babu
film career
Mumbai
  • Loading...

More Telugu News