ntr: మరో అరుదైన ఘనతను సాధించిన 'జై లవకుశ'

  •  అదే దూకుడు చూపుతోన్న 'జై లవ కుశ'
  •  ఇంతవరకూ 130 కోట్ల గ్రాస్ వసూలు
  •  'జనతా గ్యారేజ్' రికార్డు ను క్రాస్ చేసే ఛాన్స్
  •  ఎన్టీఆర్ నటన విన్యాసమే ప్రధాన ఆకర్షణ    

దసరా పండుగకి వారంరోజుల ముందుగానే విడుదలైన 'జై లవ కుశ' .. విడుదలైన ప్రతి ప్రాంతంలోను విజయవిహారం చేస్తోంది. తొలిరోజున మిశ్రమ స్పందన వచ్చినా .. వసూళ్లు పుంజుకుంటూ వచ్చాయి. మూడవ వారంలోకి ఎంటరైన ఈ సినిమా, తెలుగు రాష్ట్రాల్లోనే 87 కోట్లవరకూ రాబట్టింది. ఇక ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే ఇంతవరకూ 130 కోట్ల గ్రాస్ ను సాధించింది. త్వరలోనే ఈ సినిమా 'జనతా గ్యారేజ్' వసూళ్లను క్రాస్ చేసే ఛాన్స్ ఉందని చెబుతున్నారు.

'జనతా గ్యారేజ్' 134.8 కోట్లను రాబట్టింది. ఇక జీఎస్టీ బిల్లు అమల్లోకి వచ్చిన తరువాత 80 కోట్లు రాబట్టిన సినిమా 'జై లవ కుశ' మాత్రమేనని అంటున్నారు. ఒక రకంగా ఇది 'జై లవ కుశ' సాధించిన అరుదైన ఘనత అని చెబుతున్నారు. మొత్తానికి మూడు పాత్రలతో ఎన్టీఆర్ చేసిన నట విన్యాసం బాగా కలిసొచ్చిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.     

ntr
rasi khanna
  • Loading...

More Telugu News