thailand: ఇంగ్లండ్ పారిపోయిన మాజీ ప్రధానిని తిరిగి రప్పిస్తాం: థాయ్ లాండ్ ప్రధాని

  • బియ్యం కుంభకోణానికి పాల్పడ్డారంటూ మాజీ ప్రధాని ఇంగ్లక్ షినవ్రతపై అభియోగాలు
  • కోర్టుకు పలు మార్లు గైర్హాజరైన మాజీ ప్రధాని 
  • థాయ్ లాండ్ నుంచి దుబాయ్ కి రహస్యంగా చేరిన షినవ్రత

ఇంగ్లండుకు పారిపోయిన మాజీ ప్రధాని ఇంగ్లక్‌ షినవత్రాను దౌత్యమార్గంలో తీసుకొస్తామని థాయ్‌ లాండ్‌ ప్రధాని ప్రయూత్ చాన్ ఓచా తెలిపారు. ఇమ్మిగ్రేషన్ చట్టాలను ఉల్లంఘించి, బియ్యం కుంభకోణానికి పాల్పడి, దేశానికి బిలియన్ డాలర్ల నష్టం కలిగించారంటూ ఆమెను అరెస్టు చేసేందుకు క్రిమినల్‌ కోర్టు రెండోసారి అరెస్టు వారెంట్‌ జారీ చేసింది.
 
ప్రభుత్వ పథకంలో అవినీతి జరిగితే తన తప్పు ఎందుకవుతుందని మాజీ ప్రధాని గతంలో ప్రశ్నించారు. రాజకీయ కుట్రకు తాను బలిపశువునయ్యానని ఆమె వాపోయారు. కాగా, ఆగస్టులో ఆమె దేశం విడిచి దుబాయ్ కు, అటు నుంచి ఇంగ్లండ్ కు పారిపోయారని తెలుస్తోంది.

 అయితే థాయ్ లాండ్ నుంచి ఆమె దుబాయ్ కి ఎలా వెళ్లారన్నది మిస్టరీగా మారింది. తాజా సమాచారం ప్రకారం సెప్టెంబర్ 11న దుబాయ్ నుంచి ఇంగ్లండ్ వెళ్లినట్టు ఉండడంతో థాయ్ అధికారులు షాక్ అయ్యారు. దీంతో ఆమెను దౌత్యమార్గంలో రప్పిస్తామని ప్రస్తుత ప్రధాని ప్రయూత్ చాన్ తెలిపారు.

  • Loading...

More Telugu News