rss: ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్ కు తృటిలో తప్పిన ప్రమాదం

  • మోహన్ భగవత్ కాన్వాయ్ లో పేలిన కారు టైరు
  • ముందు వెళ్తున్న కారును ఢీ కొట్టిన కారు
  • మరో కారులో బృందావనం వెళ్లిన ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్ 

ఆర్‌ఎస్‌ఎస్‌ అధినేత మోహన్‌ భగవత్‌ కు తృటిలో ప్రమాదం తప్పింది. బృందావనంలో ఒక కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆయన ఢిల్లీ నుంచి బయల్దేరారు. ఉత్తరప్రదేశ్ లోని మథురలోని సురీర్‌ ప్రాంతం వద్ద యమునా ఎక్స్‌ ప్రెస్‌ వేపై ఆయన కాన్వాయ్‌ లోని ఒక కారు టైరు పేలిపోయింది. దీంతో అదుపుతప్పిన ఆ కారు ముందు వెళ్తున్న మరో కారును ఢీ కొట్టింది. దీంతో కాన్వాయ్ లోని సిబ్బంది ఆందోళనకు గురయ్యారు. కాగా, భగవత్ కు ఎలాంటి ప్రమాదం వాటిల్లలేదని సిబ్బంది తెలిపారు. ఘటన అనంతరం మరో కారులో ఆయన బృందావనం వెళ్లినట్టు తెలుస్తోంది. 

rss
mihan bhagawath
up
delhi
  • Loading...

More Telugu News