lavanya tripathi: లావణ్య త్రిపాఠికి కోపం తెప్పించిన కామెంట్!

- వరుస సినిమాలతో దూసుకుపోతోన్న లావణ్య త్రిపాఠి
- గ్లామరస్ పాత్రలకి పనికిరారంటూ ఓ అభిమాని పోస్ట్
- ఆ కామెంట్ తో అసహనానికి లోనైన లావణ్య
- ఆ అభిప్రాయం తప్పంటూ సమాధానం
తెలుగు తెరపై కథానాయికగా లావణ్య త్రిపాఠికి మంచి గుర్తింపు వుంది. ఇంతవరకూ ఆమెకి తెరపై పద్ధతిగా కనిపించే పాత్రలే వచ్చాయి. దాంతో ఆమె గ్లామరస్ పాత్రలో చేయడానికి తనవంతు ప్రయత్నం చేస్తోంది. 'యుద్ధం శరణం' సినిమాలో ఆమెకి దక్కిన పాత్ర ఆ తరహాలోదేనని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో "మీరు చాలా బాగుంటారు గానీ .. ట్రెడిషనల్ పాత్రలకి మాత్రమే పనికొస్తారు" అంటూ ఓ అభిమాని ఆమెకి సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు.
ఈ కామెంట్ .. లావణ్య త్రిపాఠికి కోపాన్ని తెప్పించింది. " మీ పోస్టులో వున్న అక్షర దోషాల మాదిరిగానే .. మీ అభిప్రాయం కూడా తప్పు. ఒకే రకమైన పాత్రలకి నన్ను పరిమితం చేయొద్దు" అంటూ తనదైన శైలిలో సమాధానమిచ్చింది. త్వరలో 'ఉన్నది ఒకటే జిందగీ' అనే సినిమాతో ఆమె ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాతో తనకి హిట్ పడటం ఖాయమనే నమ్మకంతో ఆమె వుంది.