sweets: స్వీట్లు ఎక్కువగా తింటున్నారా?... అయితే మీ గుండె జాగ్రత్త!
- అతిగా స్వీట్లు తింటే గుండె జబ్బులు
- పక్షవాతం కూడా రావొచ్చు
- తాజా పరిశోధనలో వెల్లడి
తియ్యగా ఉంటాయి కదా అని ఎక్కువ మొత్తంలో స్వీట్లు తినడం వల్ల గుండెకు ప్రమాదమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. బ్రిటన్‌లోని సర్రే యూనివర్సిటీలో పరిశోధనా బృందం ఈ విషయాన్ని కనిపెట్టింది. కాలేయంలో కొవ్వు ఎక్కువ, తక్కువగా ఉన్న కొంతమందిని రెండు వర్గాలుగా విభజించి వారు పరిశోధన చేశారు. 12 వారాల పాటు వీరికి గ్లూకోజ్ ఎక్కువ, తక్కువ ఉన్న ఆహార పదార్థాలను ఇచ్చారు. స్వీట్లలో గ్లూకోజ్ ఎక్కువగా ఉండటం వల్ల అవి తిన్న వారి కాలేయంలో కొవ్వుస్థాయులు పెరిగి హృదయంపై ప్రభావం చూపించినట్లుగా వారు గుర్తించారు. అలాగే వారిలో జీవక్రియా చర్యలు కూడా మందగించినట్లు కనిపెట్టారు. ఇలా జీవక్రియా చర్యలు మందగించడం వల్ల హృద్రోగాలు, పక్షవాతం వంటి జబ్బులు వస్తాయని వారు పేర్కొన్నారు.