tapsee: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం!

  • మెర్సిడెజ్ బెంజ్ కారును సొంతం చేసుకున్న తాప్సీ 
  • ఆదిలాబాద్ లో కల్యాణ్ రామ్ 'ఎమ్మెల్యే'
  • విజయ్ దేవరకొండతో గౌతమ్ మీనన్ ప్రాజక్ట్ 
  • 'ఇంద్రసేన' ట్రైలర్ వదులుతున్న విజయ్ ఆంథోనీ


*  ఇటీవల తెలుగులో 'ఆనందో బ్రహ్మ', హిందీలో 'జుడ్వా 2' చిత్రాలతో హిట్స్ సొంతం చేసుకున్న సొట్ట బుగ్గల చిన్నది తాప్సీ ప్రస్తుతం మహా హ్యాపీ మూడ్ లో వుంది. దీనికి కారణం, తాను కలలుగంటున్న మెర్సిడెజ్ బెంజ్ కారును సొంతం చేసుకుంది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. 'మా ఇంట్లోకి వచ్చిన కొత్త సభ్యుడు మార్గెరెట్ (కారు పేరు)ను ఆహ్వానిద్దాం..' అంటూ ట్వీట్ చేసింది.
*  నందమూరి కల్యాణ్ రామ్ నటిస్తున్న 'ఎమ్మెల్యే' చిత్రం షూటింగ్ ప్రస్తుతం ఆదిలాబాద్ పరిసరాల్లో జరుగుతోంది. వచ్చే నెల మొదటి వారంతో షూటింగ్ మొత్తం పూర్తవుతుంది. నూతన దర్శకుడు ఉపేంద్ర మహదేవ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తోంది.
*  ఇటీవల 'అర్జున్ రెడ్డి' చిత్రంతో మంచి క్రేజ్ తెచ్చుకున్న విజయ్ దేవరకొండతో ఓ చిత్రం చేయడానికి ప్రేమకథా చిత్రాల స్పెషలిస్ట్ గౌతమ్ మీనన్ ప్లాన్ చేస్తున్నాడు. ఈ ప్రాజక్టు విషయమై త్వరలో విజయ్ తో చర్చిస్తాడట.
*  'బిచ్చగాడు' ఫేం విజయ్ ఆంథోనీ నటిస్తున్న 'ఇంద్రసేన' చిత్రం ట్రైలర్ ను ఈ నెల 11న రిలీజ్ చేస్తారు. జి.శ్రీనివాసన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని విజయ్ ఆంథోనీతో కలసి ప్రముఖ నటి రాధిక నిర్మిస్తోంది. 

  • Loading...

More Telugu News