suicide: సూళ్లూరుపేట సమీపంలో ప్రేమ జంట ఆత్మ‌హ‌త్య

  • నెల్లూరు జిల్లాలోని సూళ్లూరుపేట రైల్వేస్టేషన్ స‌మీపంలో ఘటన
  • రైలు కింద‌ప‌డి ఆత్మ‌హ‌త్య 
  • యువ‌తి, యువ‌కుడి వ‌య‌సు 25 ఏళ్ల‌లోపే

ఓ ప్రేమ జంట రైలు కింద‌ప‌డి ఆత్మ‌హ‌త్య చేసుకున్న ఘ‌ట‌న నెల్లూరు జిల్లాలోని సూళ్లూరుపేట రైల్వేస్టేషన్ స‌మీపంలో చోటు చేసుకుంది. ఈ రోజు ఉద‌యం రైల్వే ట్రాక్ వ‌ద్ద‌కు వ‌చ్చిన గుర్తుతెలియని యువతి, యువకుడు ఈ ఘ‌ట‌న‌కు పాల్ప‌డ్డార‌ని పోలీసులు తెలిపారు. సూళ్లూరుపేట-గోపాలరెడ్డి పాలెం రైల్వే గేట్ల మధ్య సదరు యువ‌తి, యువ‌కుడి మృతదేహాలను గుర్తించిన రైల్వే గ్యాంగ్‌మెన్ త‌మ‌కు స‌మాచారం అందించాడ‌ని అన్నారు. వారి వ‌య‌సు 25 ఏళ్ల‌లోపే ఉంటుంద‌ని తెలిపారు. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు కొన‌సాగిస్తున్నారు. 

  • Loading...

More Telugu News