srikanth: మెడికల్ థ్రిల్లర్ మూవీలో శ్రీకాంత్

  • 'యుద్ధం శరణం'లో విలన్ గా మెప్పించిన శ్రీకాంత్
  •  మెడికల్ థ్రిల్లర్ గా తెరకెక్కే మూవీలో మరో విభిన్నమైన పాత్ర
  •  వేగంగా జరుగుతోన్న ప్రీ ప్రొడక్షన్ పనులు
  •  త్వరలోనే సెట్స్ పైకి

హీరోగా శ్రీకాంత్ ఎన్నో హిట్ చిత్రాలను అందించారు. ఇక ఈ మధ్య కాలంలో ఆయన తనకి తగిన కథలు వస్తే హీరోగా చేస్తూ .. మరోపక్క ఇతర హీరోల చిత్రాలలో కీలకమైన పాత్రలను చేయడానికి కూడా ఉత్సాహాన్ని చూపుతున్నారు. ఇటీవలే 'యుద్ధం శరణం' సినిమాలో విలన్ గా మెప్పించిన ఆయన, తాజాగా మరో కీలకమైన పాత్ర చేయడానికి రెడీ అవుతున్నారు.

మెడికల్ థ్రిల్లర్ గా రూపొందనున్నఈ సినిమాకి, జైరాజ్ సింగ్ దర్శకత్వం వహించనున్నాడు. ఈ సినిమాతో అభయ్ అనే కుర్రాడు హీరోగా పరిచయమవుతున్నాడు. ఏవీఎల్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మితం కానున్న ఈ సినిమా, ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోంది. ఈ కథ చాలా కొత్తగా అనిపించిందనీ .. తన పాత్ర కూడా వైవిధ్యభరితంగా ఉంటుందని శ్రీకాంత్ అన్నారు. ఈ కారణంగానే ఈ సినిమాను అంగీకరించాననీ .. త్వరలోనే సెట్స్ పైకి వెళతామని చెప్పారు.   

  • Loading...

More Telugu News