malya: ఫార్ములా వన్ చాంపియన్ హామిల్టన్ ఇంటి పక్కనే రూ. 40 కోట్లతో విల్లా కొన్న విజయ్ మాల్యా

  • అత్యంత ఖరీదైన 'లేడీవాక్' ప్రాంతంలో విల్లా
  • సీబీఐకి సమాచారం ఇచ్చిన బ్రిటన్ ఎస్ఎఫ్ఓ 
  • ఇండియాలో బ్యాంకులకు చెల్లించాల్సిన మొత్తం రూ. 9 వేల కోట్లకు పైగానే
  • ఇటీవలే స్విస్ బ్యాంకుకు డబ్బు బదిలీ చేస్తూ దొరికిపోయిన మాల్యా

ఇండియా నుంచి పారిపోయి లండన్ లో మకాం వేసిన విజయ్ మాల్యా, అత్యంత ఖరీదైన 'లేడీ వాక్' ప్రాంతంలో ఫార్ములా వన్ చాంపియన్ హామిల్టన్ ఇంటికి సమీపంలో రూ. 39.7 కోట్లు వెచ్చించి ఓ విల్లాను కొనుగోలు చేశాడు. ఈ విషయాన్ని ఖరారు చేసిన బ్రిటన్ ఎస్ఎఫ్ఓ (సీరియస్ ఫ్రాడ్ ఆఫీస్), ఆ సమాచారాన్ని భారత సీబీఐకి అందించింది. మాల్యా ఇరుగు పొరుగుగా, కోటీశ్వరులు మాత్రమే ఉన్నారని తెలుస్తోంది.

యూబీ గ్రూప్ చైర్మన్ గా మాల్యా ఉన్న సమయంలో 17 బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాల మొత్తం, వడ్డీలతో కలిపి రూ. 9 వేల కోట్లకు చేరగా, వాటిని తిరిగి చెల్లించే మార్గం కనిపించని స్థితిలో లండన్ కు మాల్యా పారిపోయిన సంగతి తెలిసిందే. అదే సమయంలో యాక్సిస్ బ్యాంకులోని కింగ్ ఫిషర్ ఖాతా నుంచి లండన్ లోని మాల్యా బ్యాంకు ఖాతాకు రూ. 242 కోట్లు బదిలీ అయినట్టు కూడా ఎస్ఎఫ్ఓ అధికారులు వెల్లడించారు.

ఇటీవల తన లండన్ ఖాతా నుంచి స్విట్జర్లాండ్ లోని ఓ బ్యాంకు ఖాతాకు రూ. 117 కోట్లను ట్రాన్స్ ఫర్ చేస్తూ మాల్యా దొరికిపోగా, ఆయన బ్యాంకు ఖాతాలను సీజ్ చేయాలని సీబీఐ అధికారులు బ్రిటన్, స్విస్ ప్రభుత్వాలను కోరారు. దీనిపై ఆయా దేశాల ప్రభుత్వాలు స్పందించాల్సి వుంది.

  • Loading...

More Telugu News