mahesh babu: వియత్నాంలో విడుదల కాబోతోన్న 'స్పైడర్'!

  •  తెలుగులో 'స్పైడర్'కి మిశ్రమ స్పందన
  •  తమిళ .. అరబిక్ భాషల్లోను రిలీజ్
  •  ఈ సినిమాకి యాక్షన్ కొరియో గ్రాఫర్ పీటర్ హెయిన్స్
  •  ఆయనే వియత్నాంలోను ఈ మూవీని విడుదల చేస్తున్నాడు  

మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన 'స్పైడర్' సినిమాకి మిశ్రమ స్పందన లభించింది. అయినా ఈ సినిమా వసూళ్ల పరంగా తన దూకుడు చూపుతూనే వుంది. తెలుగు .. తమిళ .. అరబిక్ భాషల్లో విడుదలైన ఈ సినిమా, త్వరలో వియత్నామీస్ భాషలోను విడుదల కానుంది. ఈ సినిమాకి యాక్షన్ కొరియోగ్రాఫర్ గా పనిచేసిన పీటర్ హెయిన్స్ ప్రస్తుతం చెన్నైలో ఉంటున్నా, ఆయన వియత్నాంకి చెందినవాడే.

 ఈ సినిమాకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ఫైట్స్ ను కూడా వియత్నాంలోనే చిత్రీకరించారు. 'స్పైడర్' కంటెంట్ పీటర్ హెయిన్స్ కి తెలుసు గనుక, ఈ తరహా సినిమాలు వియత్నాంలో బాగా ఆడతాయనే ఉద్దేశంతో ఆ భాషలో ఈ సినిమాను డబ్ చేసి అక్కడ ఈ సినిమాను విడుదల చేస్తున్నాడు. ఇక అక్కడ ఈ సినిమాకి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.    

  • Loading...

More Telugu News