virat kohli: కోహ్లీని భయపెట్టిన బౌలర్ అతనేనట!

  • 2011 ప్రపంచ కప్ ఫైనల్లో మలింగ బౌలింగ్ కు భయపడ్డా
  • మలింగ యార్కర్లు భయం పుట్టించాయి
  • అమీర్ ఖాన్ షోలో కోహ్లీ వెల్లడి

ప్రస్తుత క్రికెట్లో బౌలర్లకు దడ పుట్టిస్తున్న బ్యాట్స్ మెన్లలో కోహ్లీ ముందువరుసలో ఉన్నాడు. ఎలాంటి కనికరం లేకుండా బంతులను బౌండరీలకు తరలిస్తూ, స్కోరు బోర్డును పరుగులు పెట్టించడంలో కోహ్లీకి తిరుగులేదు. సెంచరీలను అవవోకగా సాధిస్తూ పాత రికార్డులను తిరగరాస్తున్న కోహ్లీని కూడా ఓ బౌలర్ భయపెట్టాడట. అతను ఎవరో కాదు... శ్రీలంక పేసర్ లసిత్ మలింగ. బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ వ్యాఖ్యాతగా త్వరలో ప్రసారం కానున్న టీవీ కార్యక్రమానికి వచ్చిన కోహ్లీ ఈ విషయాన్ని వెల్లడించాడు.

2011 ప్రపంచ కప్ ఫైనల్లో మలింగ వేసిన యార్కర్లను ఎదుర్కోవడానికి తాను చాలా భయపడ్డానని కోహ్లీ ఈ సందర్భంగా చెప్పాడు. ఆ మ్యాచ్ లో 31 పరుగులకే సచిన్, సెహ్వాగ్ వికెట్లను కోల్పోయి కష్టాల్లో ఉన్న సమయంలో... కోహ్లీ బ్యాటింగ్ కు దిగాడు. గౌతమ్ గంభీర్ సాయంతో 83 పరుగులు జోడించిన కోహ్లీ... 35 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఔటయ్యాడు. అయితే, ఈ భాగస్వామ్యమే భారత్ కు వరల్డ్ కప్ ను సాధించి పెట్టింది. అమీర్ ఖాన్ కు కోహ్లీ ఇచ్చిన ఈ ఇంటర్వ్యూ దీపావళి సందర్భంగా ప్రసారం కానుంది.

virat kohli
lasit malinga
team india
aamir khan show
  • Loading...

More Telugu News