pinarayi vijayan: గాడ్సేను దేవుడిగా భావించే మీ నుంచి నేర్చుకోవాల్సిన అవసరం లేదు: కేరళ సీఎం

  • బీజేపీ, ఆరెస్సెస్ లపై మండిపడ్డ విజయన్
  • గాడ్సేను దేవుడిగా భావించే మీ నుంచి మేము నేర్చుకోవాలా అంటూ ప్రశ్న
  • బీజేపీ బెదిరింపులకు ఇక్కడ ఎవరూ భయపడరన్న సీఎం

బీజేపీ, ఆరెస్సెస్ లపై కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ మండిపడ్డారు. అమిత్ షా పాదయాత్రతో కేరళలో తమ బలాన్ని చాటుకోవాలని బీజేపీ, ఆరెస్సెస్ లు భావిస్తున్నాయని... అయితే వారి యాత్ర వృథా ప్రయాసగానే మిగులుతుందని ఆయన ఎద్దేవా చేశారు.

 కేంద్రంలో, ఇతర రాష్ట్రల్లో ఉన్న అధికారం అండతో కేరళలో ఏదైనా చేయగలమని అనుకుంటే... అది వారి తప్పే అవుతుందని అన్నారు. బీజేపీకి భయపడేవారు ఇక్కడ ఎవరూ లేదని చెప్పారు. దేశంలో నెలకొన్న లౌకికవాదాన్ని నాశనం చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. నాథూరాం గాడ్సేను దేవుడిగా భావించే మీ నుంచి శాంతి పాఠాలను నేర్చుకోవాల్సిన అగత్యం తమకు లేదని అన్నారు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News