dhanush: 'ప్రేమమ్' హీరోయిన్లకు వరుస ఛాన్సులు ఇస్తూ వచ్చిన ధనుష్!

  •  ప్రేమమ్ భామలతో ధనుష్ 
  •  అనుపమ పరమేశ్వరన్ తో 'కొడి'
  •  మడోన్నా సెబాస్టియన్ తో 'పవర్ పాండి'
  •  తాజాగా సాయిపల్లవితో 'మారి 2'

ఆ మధ్య మాలయాళంలో భారీ విజయాలను సాధించిన చిత్రాల జాబితాలో 'ప్రేమమ్' ఒకటిగా నిలిచింది. కథానాయికలుగా నటించిన సాయిపల్లవి .. అనుపమా పరమేశ్వరన్ .. మడోన్నా సెబాస్టియన్ కు ఈ సినిమా మంచి క్రేజ్ తీసుకువచ్చింది. తెలుగులో అనుపమా పరమేశ్వరన్ .. సాయిపల్లవి హీరోయిన్స్ గా క్రేజ్ ను సంపాదించుకోవడానికి ఈ సినిమానే కారణమైంది. ఇక మడోన్నా సెబాస్టియన్ కూడా అవకాశాలను బాగానే అందుకుంటోంది.

 ఈ ముగ్గురితో సినిమాలు చేయడానికి కోలీవుడ్ యంగ్ హీరోలు ఆసక్తిని చూపుతున్నారు. అనుపమా పరమేశ్వరన్ తో కలిసి 'కొడి' సినిమా చేసిన ధనుష్, 'పవర్ పాండి' సినిమాలో మడోన్నా సెబాస్టియన్ కు ఛాన్స్ ఇచ్చాడు. ఇక తాజాగా 'మారి 2' కోసం సాయిపల్లవిని తీసుకున్నాడు. ఇలా 'ప్రేమమ్' కథానాయికలతో హీరోగా ధనుష్ వరుస సినిమాలు చేయడం విశేషంగా చెప్పుకుంటున్నారు.

dhanush
sai pallavi
  • Loading...

More Telugu News