kamal hasan: నవంబర్ 7న కమల్ పార్టీ ప్రారంభం... అభిమానులతో మంతనాలు!

  • అభిమానులతో సమావేశమైన కమలహాసన్
  • పార్టీ పెడితే ప్రజా స్పందన ఎలా ఉంటుందంటూ ఆరా
  • నవంబర్ 7న పార్టీ ప్రకటన అని అభిమానులకు తెలిపిన కమల్

నవంబర్ 7న రాజకీయ పార్టీని అధికారికంగా ప్రారంభించేందుకు ప్రముఖ నటుడు కమలహాసన్‌ సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. తమిళనాట రాజకీయాల్లో చోటుచేసుకుంటున్న నాటకీయ పరిణామాలపై సామాజిక మాధ్యమాల ద్వారా ప్రశ్నలు గుప్పించి, విమర్శలు చేసిన ఆయన.. తాను ఇక రాజకీయాల్లోకి వచ్చినట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. పార్టీ ఏర్పాటు చేయనున్నానని తెలిపిన ఆయన దానికి సన్నాహాలు ప్రారంభించారు.

అందులో భాగంగా చెన్నైలోని ఆళ్వారుపేటలోని తన నివాసంలో అభిమాన సంఘాల నేతలతో సమావేశమయ్యారు. జిల్లాల వారీగా చర్చించిన ఆయన పార్టీ పెడితే ఎలా ఉంటుంది? ఎలాంటి వారితో చేతులు కలపాలి? పార్టీ ఏర్పాటు తరువాత ప్రజల్లోకి ఎలా వెళ్లాలి? తదితర అంశాలపై వివరాలు తెలుసుకున్నారు. అలాగే నవంబర్ 7న పార్టీని ప్రారంభించనున్నట్టు కమల్ తమకు చెప్పినట్టు అభిమానులు తెలిపారు. 

kamal hasan
politics
Tamilnadu
  • Loading...

More Telugu News