flipkart: నేటి నుంచి 8వ తేదీ వరకు ఫ్లిప్‌కార్ట్ ‘ఫెస్టివ్ ధమాకా డేస్’.. వివిధ ఉపకరణాలపై 70 శాతం డిస్కౌంట్!

  • ప్రారంభమైన ఈ-కామర్స్ ఆఫర్లు
  • నిన్న అమెజాన్, నేడు ప్లిప్‌కార్ట్
  • వినియోగదారులను ఆకట్టుకునే యత్నం

ఈ-కామర్స్ సంస్థలు మళ్లీ ఆఫర్ల వాన కురిపిస్తున్నాయి. ‘గ్రేట్ ఇండియన్ సేల్‌’తో అమెజాన్ బుధవారమే ఆఫర్లతో ముందుకు వచ్చేయగా నేడు ఫ్లిప్‌కార్ట్ ‘ఫెస్టివ్ ధమాకా సేల్’ ప్రారంభం కానుంది. దీపావళి పండుగ వేళ వినియోగదారులను తమవైపు తిప్పుకునేందుకు పలు రకాల ఆఫర్లను ప్రకటించింది.

నేటి నుంచి ఈనెల 8 వరకు కొనసాగనున్న ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో ప్రముఖ ఉత్పత్తులపై 60 నుంచి 70 శాతం వరకు ఆఫర్లు ఉన్నాయి. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రాత్రి 10 గంటల వరకు అందుబాటులో ఉండే ఆఫర్లలో ల్యాప్‌టాప్స్, కెమెరాలపై 60 వరకు రాయితీ లభిస్తుందని ఫ్లిప్‌కార్ట్ ప్రకటించింది. టీవీలు, గృహోపకరణాలపై 70 శాతం ఇవ్వనున్నట్టు పేర్కొంది. ఈ డిస్కౌంట్లకు అదనంగా యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డులతో కొనుగోలు చేసే వారికి పదిశాతం క్యాష్ బ్యాక్ లభిస్తుంది. వెరసి 70  నుంచి 80 శాతం వరకు రాయితీ లభించినట్టే.

కాగా, 4వ తేదీన ప్రారంభమైన అమెజాన్ ‘గ్రేట్ ఇండియన్ సేల్’ కూడా ఈనెల 8 వరకు కొనసాగనుంది. ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై భారీ ఆఫర్లు ప్రకటించింది. ఇక సెల్‌ఫోన్లపై గతంలో ఎన్నడూ లేనంతగా రాయితీలు ప్రకటించింది. అలాగే సిటీబ్యాంకు డెబిట్, క్రెడిట్ కార్డులు ఉపయోగించి కొనుగోళ్లు జరిపే వారికి క్యాష్ బ్యాక్ ఇవ్వనున్నట్టు ప్రకటించింది.

flipkart
amazon
festive sales
e-commerce
diwali
  • Loading...

More Telugu News