james cameron: జేమ్స్ కేమెరూన్ దర్శ‌క‌త్వంలో కేట్ విన్‌స్లెట్‌... `అవ‌తార్` సీక్వెల్‌లో కీల‌క పాత్ర

  • 20 ఏళ్ల త‌ర్వాత కేమెరూన్ ద‌ర్శ‌క‌త్వంలో కేట్‌
  • కేట్ పాత్ర పేరు రోన‌ల్‌
  • స్ప‌ష్టం చేసిన నిర్మాణ సంస్థ‌

`టైటానిక్‌` త‌ర్వాత మ‌ళ్లీ 20 ఏళ్ల‌కు జేమ్స్ కేమెరూన్ ద‌ర్శ‌క‌త్వంలో కేట్ విన్‌స్లెట్ న‌టించ‌బోతోంది. `అవ‌తార్‌` సీక్వెల్‌లో ఓ ప్ర‌ధాన పాత్ర కోసం కేట్ విన్‌స్లెట్‌ను ఎంపిక చేసుకున్న‌ట్లు చిత్ర నిర్మాణ సంస్థ ట్వంటీయ‌త్ సెంచ‌రీ ఫాక్స్ స్ప‌ష్టం చేసింది. రోన‌ల్ అనే పాత్ర‌ను కేట్ పోషించ‌నుంద‌ని నిర్మాణ సంస్థ ప్ర‌క‌టించింది.

అయితే `అవ‌తార్‌` సీక్వెల్స్‌గా వ‌స్తున్న నాలుగు సినిమాల్లో కేట్ పాత్ర కొన‌సాగుతుందా? లేదా? అనే విషయంపై స్ప‌ష్ట‌త రాలేదు. భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కిస్తున్న ఈ `అవ‌తార్‌` సినిమా సీక్వెల్‌ల‌ను 2020, 2021, 2024, 2025 సంవ‌త్సరాల్లోని డిసెంబ‌ర్ నెల‌ల్లో విడుద‌ల చేసేందుకు చిత్ర యూనిట్ నిర్ణ‌యం తీసుకుంది.

  • Error fetching data: Network response was not ok

More Telugu News