samanta: వివాహానికి హాజరయ్యే అతిథులకు సమంత ఈ కండిషన్ పెట్టిందా?

  • అతిథులకు షరతు పెట్టిన సమంత
  • కేవలం ఫొటోలకే అనుమతి, నో వీడియోస్ 
  • తన వ్యక్తిగత జీవితాన్ని యూట్యూబ్ లో పెట్టవద్దని సూచన

సమంత, నాగచైతన్యల వివాహం ఈ నెల 6, 7వ తేదీల్లో జరగనున్న సంగతి తెలిసిందే. అక్కినేని కుటుంబం, దగ్గుబాటి కుటుంబం, సమంత కుటుంబసభ్యులు, అత్యంత సన్నిహితులంతా కలిసి వందమంది వరకు హాజరుకానున్న ఈ వివాహ వేడుకపై సర్వత్రా ఆసక్తి వ్యక్తమవుతోంది. ఈ వివాహ మహోత్సవానికి సంబంధించిన పనులు గోవాలో జోరుగా జరుగుతున్నాయి.

ఈ నేపథ్యంలో తన వివాహానికి హాజరయ్యే అతిథులకు వధువు సమంత ఒక సూచన చేసిందన్న వార్త వెలుగులోకి వచ్చింది. తన వివాహ తంతుకు సంబంధించిన వీడియోలు సెల్ ఫోన్లలో ఎవరూ తీయవద్దని కోరినట్టు తెలుస్తోంది. ఫొటోలు అందరికీ అందుబాటులో ఉంచుతామని తెలిపినట్టు సమాచారం. ఫొటోలు తీసుకోవచ్చని, వీడియోలు మాత్రం ఎవరూ తీయవద్దని కోరినట్టు తెలుస్తోంది. తన వ్యక్తిగత వేడుకను యూట్యూబ్ లో పెట్టడం ఇష్టం లేదని అతిథులకు తెలిపిందన్న వార్త ఒకటి ఫిల్మ్ నగర్ లో చక్కర్లు కొడుతోంది.  

samanta
naga chitanya
nagarjuna
venky
marriage
  • Loading...

More Telugu News