kamal: 'శభాష్ నాయుడు' కోసం మళ్లీ రంగంలోకి దిగిన కమల్

  •  కొంతకాలం క్రితమే మొదలైన 'శభాష్ నాయుడు'
  •  దర్శక నిర్మాతగా కమల్
  •  ప్రమాదం కారణంగా ఆగిపోయిన షూటింగ్
  •  ఈ నెల నుంచే మళ్లీ సెట్స్ పైకి    

కమలహాసన్ ఆ మధ్య 'శభాష్ నాయుడు' సినిమాను మొదలుపెట్టారు. ఈ సినిమాకి దర్శక నిర్మాత ఆయనే. విదేశాలలో కొంతవరకూ షూటింగ్ జరుపుకుంది. ఆ తరువాత కమల్ ఓ ప్రమాదం కారణంగా గాయపడటం .. కోలుకోవడానికి కొంతకాలం పట్టడం జరిగింది. దాంతో ఈ సినిమా షూటింగ్ ముందుకు సాగలేదు.

 ఈ పరిస్థితుల్లోనే రాజకీయాలపై కమల్ దృష్టి పెట్టడం .. ఆ దిశగా ముందుకు సాగాలని నిర్ణయించుకోవడం జరిగిపోయాయి. అయితే పూర్తి స్థాయిలో రాజకీయ ప్రవేశం జరిగేలోగా 'శభాష్ నాయుడు' సినిమాను పూర్తి చేసేయాలనే నిర్ణయానికి కమల్ వచ్చినట్టుగా చెబుతున్నారు. ఈ నెల నుంచే మళ్లీ సెట్స్ పైకి వెళ్లడానికి సన్నాహాలు చేస్తున్నారట. అలాగే 'విశ్వరూపం 2' కూడా విడుదలయ్యేలా చేసి, రాజకీయాలపైనే పూర్తి దృష్టి పెట్టేస్తాడని అంటున్నారు.     

  • Loading...

More Telugu News