los vegas: దుండగుడికి ఐసిస్ తో సంబంధాలపై ఇంకా క్లారిటీ రాలేదు!: ట్రంప్

  • నరమేధంపై స్పందించిన ట్రంప్
  • తుపాకుల సంస్కృతిపై మాట్లాడేందుకు ఇది సమయం కాదు
  • అయితే దీనిపై చర్చ జరగాల్సి ఉంది

అమెరికాలోని లాస్ వెగాస్ లో ఆదివారంనాడు ఓ దుండగుడు విచక్షణారహితంగా జరిపిన కాల్పుల్లో 59 మంది ప్రాణాలు కోల్పోయారు. 500 మందికి పైగా గాయపడ్డారు. ఘటన అనంతరం దుండగుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ నేపథ్యంలో, కాల్పులకు తెగబడింది తమ సభ్యుడేనని ఐసిస్ ప్రకటించుకుంది. ఐసిస్ స్టేట్ మెంట్ పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు.

దుండగుడికి ఐసిస్ తో సంబంధం ఉందా? లేదా? అన్న విషయంపై తనకు ఇంకా క్లారిటీ రాలేదని ఆయన చెప్పారు. దేశంలో తుపాకుల సంస్కృతిపై వ్యాఖ్యానించడానికి ఇది సరైన సమయం కాదని అన్నారు. అయితే, తుపాకుల నియంత్రణపై చర్చ జరపాల్సిన అవసరం మాత్రం ఉందని చెప్పారు. 

los vegas
donald trump
isis
  • Loading...

More Telugu News