lasvegas: అమెరికాలో మా వాళ్లున్నారు... మరిన్ని దాడులు జరుపుతాం: ఐఎస్ఐఎస్ ప్రకటన

  • పెడాక్ ను ఇస్లాంలోకి మార్చి, జీహాద్ పట్ల ఆకర్షితుణ్ణి చేశాం
  • పెడాక్ మావాడేనంటూ మరోసారి ప్రకటన
  • మరిన్ని దాడులకు అమెరికా సిద్ధంగా వుండాలి 

తమవాళ్లు మరింత మంది అమెరికాలో ఉన్నారని, వారంతా దాడులకు తెగబడతారని ఐఎస్ఐఎస్ ఉగ్రవాద సంస్థ ప్రకటించింది. తాజాగా లాస్ వెగాస్ లో దాడికి పాల్పడింది తమ సైనికుడేనని చెబుతూ రెండు నిమిషాల నిడివి గల వీడియోని విడుదల చేసింది. అందులో అమెరికాపై ప్రతీకారం తీర్చుకునేందుకే లాస్‌ వెగాస్ లో నరమేధం సృష్టించామని తెలిపింది. అమెరికా దళాలు సొంత దేశాల్లోని తమను అంతమొదిస్తున్నాయని, అందుకే తాము కూడా అమెరికాలో ప్రవేశించి, అమెరికన్లను అంతమొందిస్తున్నామని తెలిపింది.

ఈ మేరకు తమ సైనికులు పని చేస్తున్నారని ఐఎస్‌ఐఎస్ వెల్లడించింది. పెడాక్ ను కొద్దినెలల క్రితమే ఇస్లాంలోకి మార్చామని, తరువాత జీహాద్ పట్ల ఆకర్షితుణ్ణి చేశామని అల్ బతార్ మీడియా ఫౌండేషన్ విడుదల చేసిన వీడియోలో ఐఎస్ఐఎస్ తెలిపింది. మరిన్ని దాడులకు ప్రణాళిక సిద్ధం చేశామని, అందుకు అమెరికా సిద్ధంగా ఉండాలని సూచించారు. కాగా, లాస్ వెగాస్ లో నరమేధానికి పాల్పడిన పెడాక్ (64) కు ఉగ్రవాద సంస్థలతో ఎలాంటి సంబంధాలు లేవని ఎఫ్బీఐ స్పష్టం చేసింది. 

lasvegas
Mandalay Bay Casino
gun fire
isis
attacks
videos
  • Loading...

More Telugu News