renu: రెండో పెళ్లి చేసుకోవ‌ద్దని పవన్ కల్యాణ్ అభిమానుల కామెంట్లు.. రేణూ దేశాయ్‌ తీవ్ర ఆగ్ర‌హం!

  • మిమ్మల్ని వ‌దిన అని గౌరవిస్తోంటే ఇలా చేస్తారా? అంటూ కామెంట్లు
  • మనం ఎలాంటి సమాజంలో ఉన్నామ‌ని రేణూ దేశాయ్ ఆవేదన
  • మ‌రో బంధం గురించి ఆలోచించడం కూడా తప్పేనా?
  • మహిళలు వారి కుమారుల‌ను పద్ధతిగా పెంచాలి

‘మీరు రెండో పెళ్లి చేసుకుంటారా? ఐ హేట్ యూ... మీరు రెండో పెళ్లి చేసుకుంటే మీరు చ‌చ్చినంత ఒట్టు.. మీరు రెండో పెళ్లి చేసుకుంటే మీపై గౌర‌వం త‌గ్గిపోతుంది.. ప‌వ‌న్ కల్యాణ్ ని అన్న అని పిలుస్తాం, నిన్ను వ‌దిన అంటాం.. మీ నిర్ణ‌యంతో అంద‌రూ బాధప‌డే అవ‌కాశం ఉంది’ అంటూ ఫేస్‌బుక్‌లో ప‌వ‌న్ క‌ల్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్‌కి అభిమానులు ఉచిత స‌ల‌హాలు ఇస్తూ కామెంట్లు చేస్తున్నారు.

ఇటీవ‌ల రేణూ దేశాయ్ ఓ ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూ... తనకు అనారోగ్యంగా ఉన్నప్పుడు, పిల్లల్ని చూసుకోవడానికి ఓ వ్యక్తి ఉంటే బాగుంటుందని అనిపించినట్లు చెప్పిన విష‌యం తెలిసిందే. దీంతో ప‌వ‌న్ క‌ల్యాణ్ అభిమానులు ఆమె వ్య‌క్తిగ‌త విష‌యంలో క‌ల‌గజేసుకుని ఇలా కామెంట్లు చేస్తున్నారు.

దీనిపై రేణూ దేశాయ్‌కి కోపం వ‌చ్చేసింది. ఈ కామెంట్లు కేవలం త‌న‌ను ఉద్దేశించిన‌వేన‌ని తాను అనుకోవడం లేదని పేర్కొంది. అసలు మనం ఎలాంటి సమాజంలో ఉన్నామ‌ని ప్రశ్నిస్తూ ఆమె మండిపడింది. 'ఎలాంటి ఆలోచనలు ఉన్న మగాళ్ల మధ్య బతుకుతున్నాం?' అంటూ ఆవేద‌న వ్య‌క్తం చేసింది. ఒక వైపు మహిళల‌ సమానత, సాధికార‌త, అత్యాచారాల నుంచి మహిళలకు రక్షణ వంటి అంశాల‌పై ప్ర‌సంగాలు చేస్తూనే.. మ‌గ‌వారు మ‌రోవైపు ఇలాంటి కామెంట్లు చేస్తున్నార‌ని చెప్పింది.

తాను ఏడేళ్లు ఒంటరిగా ఉండి, ఇప్పుడు త‌న‌కు ఒక జీవితభాగస్వామి ఉంటే బాగుండునని అనిపించిందని చెప్పాన‌ని తెలిపింది. ఒక అమ్మాయి మ‌రో బంధం గురించి ఆలోచించడం కూడా తప్పేనా? అని ఆవేద‌న వ్యక్తం చేసింది. తాను జీవితాంతం తప్పు చేశానన్న భావనతో ఒంటరిగా బతకాలా? అని ప్ర‌శ్నించింది. అమ్మాయిల భవిష్యత్తు బాగుండాలంటే, మహిళలు వారి కుమారుల‌ను పద్ధతిగా పెంచాలని తాను ఆ భ‌గ‌వంతుడిని కోరుకుంటున్నాన‌ని తెలిపింది. 
.

  • Loading...

More Telugu News