balaiah: కార్యకర్తపై మరోసారి చేయి చేసుకున్న బాలయ్య!
- తన నియోజకవర్గంలోనే ఘటన
- ఇంటింటికి టీడీపీ కార్యక్రమంలో పాల్గొన్న బాలకృష్ణ
- కార్యకర్త తొందరపడటమే కారణం
ప్రముఖ నటుడు, ఎమ్మెల్యే బాలకృష్ణ మరోసారి అసహనాన్ని ప్రదర్శించారు. తన మీదకి వస్తున్నాడనే కారణంతో తెలుగు దేశం పార్టీ కార్యకర్త చెంపను చెళ్లుమనిపించారు. హిందూపురంలోని బోయపేటలో ఇంటింటికి టీడీపీ కార్యక్రమంలో బాలకృష్ణ పాల్గొన్న సందర్భంలో ఈ ఘటన జరిగింది.
ఈ కార్యక్రమంలో బాలకృష్ణతో పాటు పెద్ద ఎత్తున అభిమానులు, టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ క్రమంలోనే ఆయన ఓ ఇంట్లోకి వెళుతుండగా.. బాలయ్య కంటే ముందు ఓ కార్యకర్త వెళ్లడానికి ప్రయత్నించాడు. దీంతో బాలయ్య అసహనంతో ఆ కార్యకర్త చెంప చెళ్లుమనిపించారు. ఎందుకంత తొందరంటూ అతనిని వారించారు.